సమంత ఆఫర్ ని కొట్టేసిన పూజా హెగ్డే.. జాక్ పాట్ ఛాన్స్ అందుకుందిగా..!!

అదృష్టం .. ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవ్వరం చెప్పలేం . నిన్న మొన్నటి వరకు పూజా హెగ్డే ని దారుణాతి దారుణంగా ట్రోల్ చేశారు . సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలోకి మరో దేవతగా మారిపోబోతుంది పూజ హెగ్డే. రీసెంట్ గా పూజా హెగ్డే టాలీవుడ్ ఇండస్ట్రీలో బంపర్ ఆఫర్ అందుకుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కబోతున్న మూవీలో ముచ్చటగా మూడోసారి అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది పూజ హెగ్డే అంటూ బాగా వార్తలు వినిపించాయి .

దీనిపై అటు అల్లు అర్జున్ ..ఇటు పూజా హెగ్డే ..అట్లీ కూడా ఏమాత్రం రియాక్ట్ కాకపోవడంతో ఫైనల్ కన్ఫర్మేషన్ గా ఈ న్యూస్ బాగా వైరల్ అయింది . ఇప్పుడు పూజా హెగ్డే మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అది కూడా సమంత ఆఫర్ అంటూ తెలుస్తుంది . నందిని రెడ్డి డైరెక్షన్లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా సమంత కీలక పాత్రలో ఓ సినిమా తెరకెక్కాలి.

దీని గురించి కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి . అయితే సమంత కొన్ని కారణాల చేత ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట . ఇప్పుడు ఆ ప్లేస్ లోకి పూజ హెగ్డే వచ్చినట్లు తెలుస్తుంది . ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అంతేకాదు ఇలాంటి ఓ ఆఫర్ అందుకోవడం పట్ల పూజ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీలవుతుందట. ఈ రెండు సినిమాలు హిట్ అయితే ఇక పూజా ని ఆపగలమా ..? అంటున్నారు జనాలు . బుట్ట బొమ్మ ఈజ్ బ్యాక్ గెట్ రెడీ రా బాయ్స్ అంటూ తమదైన స్టైల్ లో విష్ చేస్తున్నారు..!!