టాలీవుడ్ లో బంపర్ ఆఫర్ అందుకున్న కీర్తి సురేష్ .. ఫస్ట్ టైం ఆ పాన్ ఇండియా స్టార్ తో రొమాన్స్.. ఎవరంటే?

ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్దిరిపోయే ఆఫర్ అందుకుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే కీర్తి సురేష్ తెలుగులో లాస్ట్ గా నటించిన సినిమా భోళా శంకర్ . మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా డిజాస్టర్ గా మారింది .

కీర్తి సురేష్ చెల్లిగా నటించిన ఈ సినిమా ఆమెకు నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది . అంతకుముందు పలు సినిమాలతో హిట్ కొట్టిన సరే ఈ సినిమా ఇచ్చిన డిజాస్టర్ తో ఆమె తెలుగులో గౌరవం పోగొట్టుకున్నట్లు అయింది . కాగా ఆ తర్వాత తెలుగులో పెద్ద అవకాశాలు దక్కించుకొని కీర్తి సురేష్ ఫర్ ద ఫస్ట్ టైం పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అన్న న్యూస్ వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ ..పుష్ప సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఆ తర్వాత అల్లు అర్జున్ – అట్లీ దర్శకత్వంలో ఒక క్రేజీ ప్రాజెక్టు కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాల్లో పూజా హెగ్డే హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినిపించాయి . అందుకున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్గా కీర్తి సురేష్ నటించబోతుందట . సన్ పిక్చర్స్.. గీత ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి . అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా కన్ఫర్మ్ అయ్యాడు అంటూ తెలుస్తుంది . ఈ ముద్దుగుమ్మ అందరితో రొమాన్స్ చేసిన అల్లు అర్జున్ తో మాత్రం రొమాన్స్ చేయలేకపోయింది.. ఫైనల్లీ ఆ కోరిక కూడా తీర్చుకునేయబోతుంది అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!