“ఆ పదంతో” సుకుమార్ ని తిట్టిన దిల్ రాజు.. అంత పెద్ద తప్పు ఏం చేశాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ స్టార్ డైరెక్టర్ ఎవరు అంటే కళ్ళు మూసుకుని టక్కున చెప్పేది రాజమౌళి . సుకుమార్ – ప్రశాంత్ నీల్ అలాంటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ డైరెక్టర్లు . అలాంటి సుకుమార్ ని దిల్ రాజు తిట్టాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే దిల్ రాజు సుకుమారిని తిట్టిన మాట వాస్తవమే కానీ అది ఇప్పుడు కాదు ఒకప్పట్లో అన్న న్యూస్ సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

పాన్ ఇండియా డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా అయిపోయిన వెంటనే మరో బిగ్ బడా హీరోతో మరో బిగ్ ప్రాజెక్టు ను తెరకెక్కించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . సుకుమార్ కెరియర్ లోనే డిజాస్టర్ గా నిలిచిన ఫస్ట్ మూవీ “జగడం”. రామ్ పోతినేనితో ఈ సినిమాని తరికెక్కించాడు సుకుమార్ . నిజానికి ఈ సినిమాను మహేష్ బాబుతో లేదా అల్లు అర్జున్ తో తెరకెక్కించాలనుకున్నారట . దిల్ రాజు అదే పనిగా వాళ్ళిద్దరూ కాల్ షీట్స్ కోసం వెయిట్ చేశారట .

సుకుమార్ జగడం కథను వాళ్లకు వివరించగా కొన్ని సీన్స్ మార్చమంటూ సజెస్ట్ చేశారట. అయితే అప్పట్లో సుకుమార్ చాలా మొండిగా ఉండేవాడు.. తాను రాసుకున్న సీన్స్ చేసే ప్రసక్తే లేదు అంటూ చెప్పేశాడు.. దీంతో అల్లు అర్జున్ – మహేష్ బాబు ఈ ప్రాజెక్టుని రిజెక్ట్ చేశారు. దిల్ రాజు నేను మాట్లాడతాను ఆగు అని చెప్పినా కూడా వినకుండా సుకుమార్ ఎవరికి చెప్పకుండా దిల్ రాజు మాటలని లెక్కచేయకుండా రాత్రికి రాత్రి రామ్ పోతినేనితో ఈ సినిమాకు కమిట్ అయ్యాడు.

తెల్లవారుజామున షూటింగ్ స్టార్ట్ చేశారట. ఇది తెలుసుకున్న దిల్ రాజు.. సుకుమార్ ని గట్టిగా అరిచారట..” కొంచమైనా బుద్ధుందా ఇలాంటి నిర్ణయం తీసుకుంటావా..? నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి ..కానీ ఇలా చేస్తావా అంటూ ఫైర్ అయిపోయారట . సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా దిల్ రాజు సుకుమార్ ని బాగా తిట్టాడట . కొంచెం టైం తీసుకుని స్క్రిప్ట్ చేంజ్ చేసి ఉంటే కచ్చితంగా ఈ సినిమా మహేష్ బాబు- అల్లు అర్జున్ చేస్తుండేవారు నీకు మంచి హిట్టు పడి ఉండేది మిస్ చేసుకున్నావ్” అంటూ బాగా కోప్పడ్డారట..!!