పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ వచ్చిన నటించనని తెగేసి చెప్పిన స్టార్ యాక్టర్.. కారణం ఇదే..

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిది అందరికీ తెలుసు. టాలీవుడ్ స్టార్ హీరోల అందరిలోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దక్కించుకున్న వారిలో పవన్ కళ్యాణ్ మొదటి వరుసలో ఉంటాడు. ఇక ప్ర‌స్తుతం ప‌వ‌న్ ఓ ప‌క్క సినిమాల్లో.. మరోప‌క్క‌ రాజకీయాలతో బిజీగా గడుపుతున్నాడు. పవన్ కళ్యాణ్ త్వరలో ఏపీ ఎలక్షన్స్ నేపథ్యంలో దానికోసం వరుస సభలతో బిజీ అవుతున్నాడు. గ్యాప్ దొరికినప్పుడల్లా షూటింగ్స్ లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. ఇటీవల బ్రో సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ప‌వ‌న్ ఈ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. ఇక ప్రస్తుతం ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలతో పవన్ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలాగా ఉంటే గతంలో పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ వచ్చినా ఓ స్టార్ హీరో దానికి నో చెప్పేసాడట.

Sobhan Babu Vajrotsavam Event Details

అయితే ఆ సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ వస్తే చాలని ఎంతోమంది నటిలో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వచ్చిన రిజెక్ట్ చేసిన ఆ ప్రముఖ నటుడు ఎవరో ఒకసారి తెలుసుకుందాం. పవన్ సినీ కెరీర్‌ స్టార్టింగ్ లో అందుకున్న ఇండస్ట్రియల్ హిట్స్ లో సుస్వాగతం ఒకటి. ఈ మూవీ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలుసు. భీమనేని శ్రీనివాసరావు డైరెక్షన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ మూవీ అందమైన ప్రేమ కథతో పాటు.. చక్కటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో ఇండస్ట్రియల్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కు జోడిగా దేవయాని నటించిన మెప్పించారు.

A Heart touching Father And Son Relationship Scene - Suswagatham - Pawan  Kalyan, Devayani - YouTube

ఈ మూవీలో పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచి మ్యూజికల్ హిట్గా కూడా సినిమా మంచి రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటికి సుస్వాగతం లో పాటలు అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు తండ్రిగా రఘువరన్ నటించి అక‌ట్టుకున్నాడు. అయితే తండ్రి పాత్ర కోసం ముందుగా ఎవరి గ్రీన్ హీరో.. సోగ్గాడు శోభన్ బాబును భావించారట. అయితే అందుకు శోభన్ బాబు ఒప్పుకోలేదు. సుస్వాగతం టైం కు శోభన్ బాబు కెరీర్ డౌన్ అయిపోయినా హీరోగా మాత్రమే సినిమాలు చేస్తానని.. సైడ్ క్యారెక్టర్లలో నటించడం కుదరదని తెగేసి చెప్పేసాడట. దీంతో సుస్వాగతం లో నటించే ఛాన్స్ వచ్చినా శోభన్ బాబు రిజెక్ట్ చేసినట్లు అయ్యింది. ఆ తర్వాత ఆ పాత్రలో రఘువరన్ నటించి ఆకట్టుకున్నాడు.