“అభిమానులకి నచ్చిన నచ్చకపోయిన అదే నిజం”.. మహేశ్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు రీసెంట్గా ప్రముఖ జాతీయ పత్రికతో ముచ్చటించిన విషయం మనకు తెలిసిందే. ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను బయట పెట్టని మహేష్ బాబు ఈ ఇంటర్వ్యూలో మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు . జనాలకు తెలియని తన పర్సనల్ థింగ్స్ ని కూడా షేర్ చేసుకున్నారు . అయితే ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ తన కెరీర్ కి సంబంధించి చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి .

“నా కెరియర్ లో నన్ను ప్రభావితం చేసి నా కెరియర్ ని మలుపు తిప్పిన సినిమాలు అంటే మురారి – పోకిరి – శ్రీమంతుడు. ఈ మూడే .. ఆఫ్ కోర్స్ ఫాన్స్ కి అన్ని సినిమాలు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు ..కానీ నాకు మాత్రం నా కెరియర్ ని టర్న్ చేసిన సినిమాలంటే మాత్రం.. ఈ మూడు అనే చెప్తాను. మిగతా సినిమాలు కూడా నాకు బాగా నచ్చాయి . కానీ ఈ మూడు సినిమాలు నా కెరియర్ ని టర్న్ చేశాయి”..

” అన్ని చిత్రాలు లాగానే ఆడియన్స్ కి నచ్చేలా ఉండడమే కాకుండా నైతిక అంశాలు ఉండేలా ఈ కథలు ఉన్నాయి.. ఫ్యూచర్లో కూడా ఇలాంటి స్టోరీస్ వస్తే ఖచ్చితంగా చేస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు . ప్రెసెంట్ మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. మొదటి నుంచి మహేష్ బాబు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు అని అందరూ అంటుంటారు . మరోసారి ఇంటర్వ్యూ తో అదే ప్రూవ్ అయింది..!!