అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో చరణ్ ని ఘోరంగా అవమానించిన ఆ స్టార్ హీరో.. అసలేంజరిగిందంటే..?!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా పాన్‌ ఇండియా లెవెల్ పాపులారిటీ దక్కించుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రాంచరణ్ అంబానీ కొడుకు అనంత్‌ అంబానీ – రాధిక మర్చెంట్‌ల‌ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో సతీమణి ఉపాసనతో కలిసి హాజరై సందడి చేశాడు. అయితే ఈ ఈవెంట్లో ఓ స్టార్ హీరో చరణ్‌ను ఘోరంగా అవమానించడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరు.. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. భారత ఇండస్ట్రీలో షారుఖ్ ఖాన్ పేరు తెలియని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కింగ్ ఖాన్‌గా క్రేజ్ ను సంపాదించుకున్న షారుక్.. నటన విషయంలోనే కాకుండా బయట కూడా తన తోటి నటీనటులతో హుందాగా వ్యవహరిస్తూ ఉంటాడు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా గౌరవిస్తూ ఉంటాడు.

Shah Rukh Khan disrespected Ram Charan with 'idli' remark at Anant Ambani's pre-wedding bash, alleges makeup artist Zeba Hassan - India Today

అయితే అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ ఫ్రీ వెడ్డింగ్ వేడుకల్లో షారుక్ మాట్లాడిన విధానం చాలామందికి కోపం తెప్పించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను ఉద్దేశిస్తూ.. ఇడ్లీ వడ అని పిలిచాడు. దీంతో షారుక్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆర్‌ఆర్ఆర్ సినిమాలో నాటునాటు సాంగ్‌కు సల్మాన్ – అమీర్ కలిసి చిందులు వేయగా.. వీరిద్దరూ సరిగ్గా చేయలేదంటూ రామ్ చరణ్‌ను పిలిచాడు షారుక్‌. అయితే షారుక్ ఖాన్, రామ్ చరణ్‌ను పిలుస్తూ ఇడ్లీ, వడా రామ్ చరణ్ ఎక్కడా అంటూ పిలిచాడు. అది విన్న తర్వాత నేను చాలా అవమానంగా ఫీల్ అయ్యాన‌ని.. అయితే షారుక్.. రామ్ చరణ్ ని పిలిచిన విధానం చాలా హేళనగా ఉందని.. ఆయనను అవమానించినట్లు నాకు అనిపించిందని.. దాంతో నేను ఫీలై ఆ ఈవెంట్‌ నుంచి బయటకు వచ్చేసాను అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది చరణ్ మేకప్ ఆర్టిస్ట్ జీబా.

Anant Ambani Wedding: Power Couple Ram Charan, Upasana blazes in Black - Telugu News - IndiaGlitz.com

ఆమె ఎప్పటినుంచో రామ్ చరణ్ కు మేకప్ ఆర్టిస్ట్ గా పని చేస్తుంది. గ్లోబల్ స్టార్ గా క్రేజ్‌ను సంపాదించుకున్న రాంచరణ్‌ను అలా సంబోధించడం ఏంటి అంటూ ఆమె పోస్టులో షారుక్ పై ఫైర్ అయింది. దక్షిణాది హీరోలు అంటే నార్త్ వాళ్ళకి ఎప్పటినుంచో ఇలాంటి చిన్న చూపు ఉందంటూ విమర్శించింది. తను షారుక్‌కు పెద్ద అభిమానిని.. అయితే రాంచరణ్‌ని అతను స్టేజ్‌పై అలా ఇడ్లీ వడ అంటూ పిలిచి అవమానించిన తీరు నాకు అసలు నచ్చలేదని.. స్టోరీస్ లో పోస్ట్ చేసింది జీబా. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్‌ నట్టింట వైరల్ గా మారడంతో చెర్రీ ఫ్యాన్స్ షారుక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షారుక్ నుంచి ఇలాంటిది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.