“దేవర” న్యూ పోస్టర్: ఈ పిక్ లో జాన్వి కట్టుకున్న చీర ఎవరిదో తెలుసా..? వెరీ వెరీ స్పెషల్..!

“దేవర” .. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తరికెక్కుతున్న మూవీ . అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ ..ఆర్ ఆర్ ఆర్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తరువాత నటిస్తున్న సినిమా ఇదే. ఇద్దరికీ ఈ సినిమా హిట్ అవ్వడం చాలా కీలకం . ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఏకంగా 6 కేజీల బరువు తగ్గాడట ..ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఎంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తున్న మూవీ కూడా ఇదే కావడం గమనార్హం.

ఈ సినిమాలో బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. కాగా నేడు జాన్వికపూర్ పుట్టినరోజు . ఈ సందర్భంగా దేవర టీం ఆమె కోసం స్పెషల్ పోస్ట్ ని రిలీజ్ చేసింది . “హ్యాపీ బర్త్డ డే తంగం అంటూ క్యారెక్టర్ నేమ్ రివ్యూ చేస్తూ జాన్వి కపూర్ ట్రెడిషనల్ లుక్ ను రిలీజ్ చేసింది “.

ఇదివరకు రెండు సార్లు దేవర మూవీ టీం జాన్వి కపూర్ పిక్స్ ను రిలీజ్ చేసింది. ఈ రెండు పిక్స్ లో కంపేర్ చేస్తే తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో చాలా అద్భుతంగా కళ్ళకు వినసొంపుగా జాన్వికపూర్ కనిపిస్తుంది . ఈ ఫోటోలోని చీర హైలెట్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చీర తన తల్లి శ్రీదేవిది అంటూ తెలుస్తుంది . ఆమె తెలుగు ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనేది తెలిసిందే. తన తల్లి ఆశీస్సులు తనకు ఉండేలా ఈ సినిమా కోసం తన తల్లి చీరను కట్టుకొని ఓక పాటలో నటించింది అనే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!