ఆత్మహత్య చేసుకోబోతున్నా.. నా చావుకు కారణం అతనే.. నటి సెన్సేషనల్ వీడియో పోస్ట్..!

ఎస్ మీరు చూస్తున్నది నిజమే.. ఇటీవల ఓ న‌టి నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను.. నా ఆత్మ హ‌త్య‌కు కారణం ఓ వ్యక్తి అంటూ సోషల్ మీడియా వేదికగా వీడియో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింటి వైరల్ గా మారింది. తనకు జరిగిన అన్యాయం పై స్పందించిన ఆమె నేను చనిపోవాలని డిసైడ్ అయ్యాను అంటూ వీడియోలో పేర్కొంది. ఇంతకీ ఆ నటి ఎవరు.. ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి కారణమైన ఆ వ్యక్తి ఎవరో చూద్దాం. తమిళ్ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి విజయలక్ష్మి. 1997లో నాగ మండలం సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ జోడి హక్కి, భూమిపై చర్చల మగ, అరుణోదయ, స్వస్తిక్, సూర్యవంశం లాంటి హిట్ సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. తమిళనాడులో ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో హనుమాన్ జంక్షన్ సినిమాలోని.. జగపతిబాబు, అర్జున్‌ల‌కు చెల్లిగా నటించి ఆకట్టుకుంది.

Actress Vijayalakshmi files a 4-page complaint against Seeman at the Police  Commissioner's office in Chennai, aims to re-open the 2011 case | Tamil  Movie News - Times of India

మోహన్‌లాల్‌తో మలయాళ సినిమా దేవదూతంలో నటించింది. ఇలా తెలుగు, తమిళంలో మొత్తంగా 40 సినిమాలకు పైగా నటించిన ఈమె తమిళనాడుకు చెందిన నామ్ తమిళ కచ్చి పార్టీ హెడ్.. యాక్టర్, డైరెక్టర్ సీమన్ పై ఆరోపణలు చేసింది. సీమన్‌ తనకు పెళ్లి చేసుకుంటానని మోసం చేసి సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఏడుసార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తర్వాత ఫిబ్రవరి 9న సీమన్‌తో మాట్లాడాలని కోరుతూ వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియో పై ఎటువంటి స్పందన సీమ‌న్‌నుంచి రాలేదు. దీంతో తాజాగా మరో సంచలన వీడియోని షేర్ చేసింది విజయలక్ష్మి. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ మీడియా మిత్రులకు నమస్కారం.

Prokerala on X: "Tamil actress Vijayalakshmi has been admitted to hospital  after she allegedly tried to commit suicide. Read Article:  https://t.co/kidTRd5MMQ #Vijayalakshmi #tamilactress #Tamil  https://t.co/Yv3PGRFwrD" / X

ఫిబ్రవరి 29 నేను ఓ వీడియో షేర్ చేశా. ఆ వీడియోలో నామ్ తమిళ కచ్చి పార్టీ అధినేత, నటుడు సీమన్ నాతో మాట్లాడాలంటూ పేర్కొన్నాను. కలిసి జీవించాలని కోరాను.. కానీ ఎలాంటి రెస్పాన్స్ అతని నుంచి రాలేదు. చాలా బాధగా అనిపిస్తుంది. ఏడుస్తూ ఓ వీడియోను అతనికి కూడా షేర్ చేశాను. నువ్వు కావాలి, నువ్వు లేకుంటే చనిపోతా అని చెప్పినా ఆయన పట్టించుకోలేదు. నన్ను సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఇలా జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు అక్కర్లేదంటూ వదిలేశాడు. నాకు బ్రతకడం చాలా కష్టంగా ఉంది. ఎవరు సాయం కూడా చేయడం లేదు. పట్టించుకోవడం లేదు. కర్ణాటకలో నేను బ్రతకలేకపోతున్నా. ఆత్మహత్య చేసుకోవాలని ఫిక్స్ అయ్యా. ఇదే నా చివరి వీడియో. నా చావుకు సీమన్‌నే కారణం. అతనే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అంటూ ఆమె వివరించింది. మంగళవారం ఈమె పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నేటింటా వైరల్ గా మారింది. ఇక ఆత్మహత్యకు పాల్పడిన విజయలక్ష్మి నీ హాస్పిటల్ కు తరలించగా ఆమె ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు.