వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్: బన్నీ అది త్యాగం చేస్తేనే స్నేహారెడ్డి పెళ్ళికి ఒప్పుకుందా..? బయటపడ్డ టాప్ సీక్రెట్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంత పెద్ద తోపైనా సెలబ్రిటీనో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ నేడు తన పెళ్లిరోజును ఘనంగా జరుపుకున్నారు . స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత లైఫ్ ని ఎంత బిందాస్ గా ఎంజాయ్ చేశాడో అందరికీ తెలిసిందే .

వీళ్ళ ప్రేమ వ్యవహారం అందరికీ తెలుసు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. మొదటి చూపులోనే బన్నీ స్నేహారెడ్డిని చూసి ఇంప్రెస్స్ అయిపోయాడు. స్నేహ రెడ్డి కూడా బన్నీ ప్రపోజ్ చేయగానే ఓకే చెప్పేసింది . జనాలకి ఇంత వరకే తెలుసు. అయితే స్నేహ రెడ్డి ఓ క్రేజీ కండిషన్ పెట్టి బన్నీను పెళ్లి చేసుకుంది అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ గా బన్నీ తన భార్యకు విష్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

ఇదే క్రమంలో బన్నీకి స్నేహ రెడ్డి పెట్టిన కండిషన్ కూడా వైరల్ గా మారింది . మనకు తెలిసిందే బన్నీ మొదటి నుంచి చాలా అల్లరి అల్లరి టైప్. అయితే స్నేహ రెడ్డి మాత్రం అలా కాదు రిజర్వ్డ్ గా ఉంటుంది . అమ్మాయిలను బన్నీ బాగా ఆటపట్టిస్తాడు.. అది స్నేహారెడ్డికి నచ్చదు .. పెళ్లికి ముందే కండిషన్ పెట్టిందట . పెళ్లి తర్వాత అమ్మాయిలని అలా ఏడిపించకూడదు.. సరదా సరదాగా కూడా ఆటపటించకూడదు అని ..ప్రామిస్ తీసుకుందట. దానికి ఒప్పుకున్నాకే బన్నీను పెళ్లి చేసుకుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . ఈ జంట ఎప్పుడూ ఇలాగే ఉండాలి అంటూ టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కూడా బ్లెస్స్ చేస్తున్నారు . ప్రెసెంట్ పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్..!!