హవా: పబ్లిక్ లో కాజల్ ను అక్కడ టచ్ చేసిన అభిమాని.. ఆమె ఏం చేసిందంటే..?!

హీరోయిన్స్, యాక్టర్స్ అన్నాక షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌, ప్నైవేట్ ఈవెంట్స్‌కు వెళ్లి సందడి చేయడం.. అలాంటి ఈవెంట్స్ కు వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ దగ్గర నుంచి కొని ఇబ్బందులు ఎదురవడం సాధారణంగా జరుగుతుంది. ఇక స్టార్ హీరోయిన్స్ అంతా దాదాపు ఇలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తూనే ఉంటారు. కాబట్టి జనం గుంపుగా ఉండే చోట హీరోయిన్స్ న‌డ‌వ‌టానికి తెగ ఇబ్బంది పడతారు. ఇక హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా తాజాగా ఇలాంటి ఇబ్బందిక‌ర సంఘటన ఎదుర్కొంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ తెలుగు ప్రేక్షకులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయంతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ‌ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. 2020లో బిజినెస్ మ్యాన్‌ గౌతమ్ కిచ్లును వివాహం చేసుకొని నటనకు కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. కొడుకు పుట్టిన తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇచ్చి నటనలో దూసుకుపోతుంది. గ‌తేడాది భగవంత్‌ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించిన.. ఈ బ్యూటీ ఇప్పటికీ అదే ఫిట్నెస్‌తో ఆకట్టుకుంటుంది.

ఇక తాజాగా కాజల్‌.. భంజార హిల్స్ రోడ్ నెంబర్.10 లో షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్ళి సందడి చేసింది. ఫ్యాన్స్ చాలామంది అక్కడ హడావిడి చేయడంతో వాళ్ళ సెల్ఫీలకు స్టిల్స్ ఇచ్చింది.. ఈ ముద్దుగుమ్మ. అయితే అందరూ బాగానే సెల్ఫీలు దిగి వెళ్లిపోయారు. కానీ ఓ అభిమాని మాత్రం కాజల్‌తో ఫోటో దిగుతూ పబ్లిక్ లో ఆమె నడుముపై చేయి వేశాడు. దీంతో ఆమె ఒక‌సారిగా షాక్ అయ్యింది. వెంటనే కాజల్ బౌన్సర్లు అతని పక్కకు లాగి పడేశారు. గతంలో కూడా కాజల్ ఇలాంటి ఓ సంఘ‌ట‌న‌ను ఎదుర్కొంది.