రష్మీ గౌతమ్ ఇంట తీవ్ర విషాదం.. నాకు ఎంతో ఇష్టమైన ఆమెను కోల్పోయా.. యాంకర్ ఎమోషనల్ పోస్ట్ ..

బుల్లితెర యాంకర్ రష్మీ జబర్దస్త్ షో ద్వారా భారీ పాపులారిటి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా బోల్డ్ షో చేస్తూ యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక తర్వాత పలు సినిమాల్లో ఆఫర్లు అందుకుంటూ.. ఓ పక్కన యాంకర్ గాను, మరో పక్కన న‌టిగాను రాణిస్తుంది. ఇక తాజాగా రష్మి గౌతమ్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె ఎప్పటి నుంచో ముద్దుగా పెంచుకుంటూ.. గారాబంగా చూసుకుంటున్న తన పెట్ డాగ్ చుట్కి గౌతం మరణించింది.

Rashmi Gautam : ఫ్యామిలీ మెంబెర్‌ని కోల్పోయిన బాధలో రష్మీ.. అస్థికలతో  పోస్టు.. | Rashmi gautam shares a emotional post in her instagram-10TV  Telugu

సాధారణంగానే రష్మి పెట్స్ లవర్ అన్న సంగతి చాలా మందికి తెలుసు. మూగజీవాలకు ఎటువంటి ఇబ్బంది కలిగిన.. ఈమె వెంటనే రియాక్ట్ అయ్యేది. సోషల్ మీడియా వేదికగా స్పందించేది. అలాంటిది ఆమె ఎంతో ముద్దుగా పెంచుకున్న చోట్కి మరణించడంతో ఆమె ఎమోషనల్ అవుతూ ఓ పోస్ట్ షేర్ చేసింది. దీంతో ఆమె ఎమోషనల్ అవుతూ తన పెట్ డాగ్ బతికి ఉన్నప్పుడు దానితో కలిసి ఉన్న‌ హ్యాపీ మూమెంట్ ఫొటోస్ ను.. అది చనిపోయిన త‌ర్వాత దానికి పూల‌మాల‌లు వేసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.

దీంతో పాటే ఎమోషనల్ నోట్ రాసుకోవచ్చింది. నా సాసి ప్రిన్సెస్.. నా బంగారంతో గత 24 గంటలు ఎంతో ఎమోషనల్ గా గడిచాయి. ఆమె లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. చివరి వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా లవ్ యు మై బేబీ గర్ల్ అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం రష్మీ చేసిన పోస్ట్ నెట్టింట‌ వైరల్ అవ్వడంతో బాధపడకు రేష్మి అంటూ.. చుట్కి గౌతం జ్ఞాపకాలు నీతోనే ఉంటాయి లే అంటూ.. స్వర్గంలో ఆమె సంతోషంగా ఉంటుంది అంటూ రష్మిని ఓదారుస్తూ కామెంట్స్ చేస్తున్నారు.