కోట్లు ఇచ్చిన చిరంజీవి అలాంటి పాత్రలో కనిపించడు..ఎందుకో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ప్రతి ఒక్క పాత్రను పోషించాల్సి ఉంటుంది. అలాంటి పాత్ర పోషించను .. ఇలాంటి పాత్ర పోషించను అంటే కుదరదు. కొన్నిసార్లు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే మనకు ఇష్టం లేని పాత్రలు కూడా పోషించాలి . అయితే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి ఒక టైపు పాత్రలో మాత్రం అస్సలు కనిపించలేదు .

దానికి కారణం ఏంటా..? అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు .. మెప్పించాడు సినిమాలలో కూడా నటనకు మంచి మార్కులు పడ్డాయి . అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో చిరంజీవి ఇప్పటివరకు.. జబ్బు పాత్రలో కనిపించలేదు అని.. అలాంటి జబ్బు పాత్రలో కనిపించే రోల్స్ ఆయన వద్దకు వచ్చిన రిజెక్ట్ చేశాడు అన్న న్యూస్ వైరల్ గా మారింది .

నిజానికి చిరంజీవి అమ్మగారు అంజనాదేవికి చిరంజీవిని అలా జబ్బు పాత్రలో చూడడం అంటే చాలా చాలా బాధ వేస్తుందట. అందుకే మొదటి నుంచి చిరంజీవిని ఎలాంటి పాత్రలో నటించద్దు అంటూ రిక్వెస్ట్ చేసిందట . అమ్మ కోరిక ప్రకారం చిరంజీవి ఆ విధంగా జబ్బు పాత్రలో కనిపించకుండా.. ఇండస్ట్రీలో హీరోగా నెట్టుకు వస్తున్నాడు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది..!!