పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క…. ఎక్కడి నుంచి పోటీ అంటే..!

ప్రభాస్ కి జోడిగా ఇప్పటికే ఎన్నో వార్తల్లో నిలిచిన అనుష్క శెట్టి మన అందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ప్రతి ఒక్కరిని ఆకర్షించిందని చెప్పుకోవచ్చు.

ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుత కాలంలో పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఇందుకు కారణం స్వీటీకి సరైన అవకాశాలు రావడం లేదు. సైజ్ జీరో సినిమా తరువాత భారీగా లావైన స్వీటీకి ఏ డైరెక్టర్ కూడా అవకాశం ఇచ్చేందుకు ముందుకు రాలేదు.

ఇక ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలీ శెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయం సొంతం చేసుకున్న అనుష్క ప్రస్తుతం రాజకీయంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తుంది. జనసేన నుంచి నగరి ఎమ్మెల్యేగా అనుష్క పోటీ చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అనుష్కకి ఆపోజిట్ గా పోటీ చేసే రోజా కి ఇది గట్టి దెబ్బ అని చెప్పుకోవచ్చు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో అనుష్క నోరు విప్పితేనే కానీ అసలు గుట్టు బయటికి రాదు.