శివాజీని స్టార్ హీరోగా చేస్తానని మాట ఇచ్చి.. స‌క్స‌స్ అయ్యిన‌ ఆ డైరెక్టర్.. ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కాలేజ్ సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు శివాజీ. వరుసగా మంచి సినిమాలలో నటిస్తూ స్టార్‌ హీరోగా ఎదిగిన శివాజీ.. చిన్న చిన్న సినిమాలతో పెద్ద సక్సెస్‌ల‌ను అందుకుంటూ భారీ పాపులారిటి ద‌క్కించుకున్నాడు. ఇలాంటి క్రమంలో రాజకీయాలపై స్పందించిన ఆయన.. సినిమాలకు మెల్లమెల్లగా దూరమయ్యాడు. ఇక ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టి ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 90స్ కిడ్స్‌ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో శివాజీకి కొన్ని మంచి ఆఫర్స్ ను చేజక్కించుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్న టైంలో డైరెక్టర్ నీలకంఠతో మిస్సమ్మ అనే ఓ సినిమాను నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమా టైంలోనే శివాజీ తో డైరెక్టర్ మిస్సమ్మ నీకు కచ్చితంగా ఓ బ్లాక్ బస్టర్ హిట్ అందించి.. నిన్ను స్టార్ హీరోగా నిలబెడతానని మాట ఇచ్చాడట. దాంతో శివాజీ ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 100% ఎఫ‌ర్ట్‌పెట్టి వర్క్ చేశారు. దీంతో ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి.. శివాజీకి మార్కెట్‌ను మ‌రింత పెంచింది.

Missamma (2003) - IMDb

అయితే తర్వాత వీరిద్దరికి కాంబోలో కొన్ని సినిమాలు రావాల్సి ఉండగా.. ఏవో కారణాలతో ఆ సినిమాలు పట్టాలెక్కలేదు. అయితే కొన్ని హిట్ సినిమాలుకు డైరెక్షన్ వహించిన నీలకంఠ.. ప్రస్తుతం డైరెక్షన్ రంగం నుంచి దూరం అయ్యాడు. ఇక శివాజీ నిన్న మొన్నటి వరకు సినిమాలకు దూరంగా ఉన్నా.. ఇప్పుడిప్పుడే మరోసారి సినిమాల్లో రీ ఎంట్రి ఇస్తూ తన సత్తా చాటుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇక తాజాగా శివాజీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ప్ర‌స్తుతం మంచి క్యారెక్టర్స్ ను ఎంచుకుంటూ జాగ్రత్తగా సినిమాల్లో నటిస్తున్నట్టు వివరించాడు. ఇదిలా ఉంటే బోయపాటి నెక్స్ట్ సినిమాలో కూడా ఓ మంచి క్యారెక్టర్ లో శివాజీ నటించనున్నాడని తెలుస్తుంది.