రామ్ చరణ్ బిరుదు మారిపోయిందోచ్.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ కాదు.. కొత్త ట్యాగ్ ఏంటి అంటే..?

ఇన్నాళ్లు రామ్ చరణ్ అంటే ముందుగా మనకి మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ కనిపించేది . అయితే ఇప్పుడు ఆ బిరుదు మారిపోయింది. ఇకపై మనం రాంచరణ్ ని మెగా పవర్ స్టార్ అంటూ కాదు సరికొత్త ట్యాక్ తో పిలవాలి. ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసేసాడు బుచ్చిబాబు సనా.. మనకు తెలిసిందే.. మగధీర సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకా పక్కాగా చెప్పాలి అంటే గేమ్ చేంజర్ సినిమా వరకు కూడా అందరూ మెగా పవర్ స్టార్ అంటూ రాంచరణ్ ని పిలిచేవారు .

అయితే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమా నుంచి మాత్రం రామ్ చరణ్ ట్యాగ్ మారిపోయింది అని అంటున్నారు. రీసెంట్గా రాంచరణ్ పేరు ముందు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ వేశాడు బుచ్చిబాబు సన . దీంతో ఇకపై రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ కాదని గ్లోబల్ స్టార్ అని ఫ్రెండ్స్ ..ఫ్యాన్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు రామ్ చరణ్ . దానిని అందరికీ తెలియజేసేలా ఇకపై గ్లోబల్ స్టార్ అంటూ రాంచరణ్ పేరు ముందు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటూ అనౌన్స్ చేశారు . ప్రెసెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.

ఈ సినిమా అయిపోయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ మరొక సినిమాలో నటించబోతున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం .. ఈ సినిమా రంగస్థలంకి సీక్వెల్ అంటున్నారు . ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించబోతున్నారట . అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ని చూస్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!