చేతిలో సినిమాలు లేక..అలాంటి పనులు చేసుకుంటున్న శ్రీలీల..ఎంత కష్టం వచ్చిందో పాపం..!!

శ్రీ లీల .. ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ . ఎంతలా అంటే ఆమె కాల్ షీట్స్ ఒక్క రోజు దొరికిన చాలు మేకర్స్ పండగ చేసుకునేవాళ్ళు . అలాంటి స్టార్ డం ను ఎంజాయ్ చేసింది . సీన్ కట్ చేస్తే సరిగ్గా రెండు సంవత్సరాల లోనే అమ్మడు ఫేట్ మారిపోయింది. ఇప్పుడు శ్రీలీల ఖాతాలో సినిమాలు ఉన్నాయి. కానీ కొత్తగా కమిట్ అయిన సినిమాలు ఏమీ లేవు ,

గత ఆరు నెలల నుంచి శ్రీలీల ఒక్కటంటే ఒక్క సినిమాకి కమిట్ కాకపోవడం గమనార్హం. సినిమాలు ఆమె వరకు రావడం లేదు. దానికి కారణం వరుసగా ఆమె ప్లాప్స్ అందుకోవడమే. ఆమె నటించిన మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో శ్రీలీలకు ఐరన్ లెగ్ అంటూ టాగ్ చేశారు . మరీ ముఖ్యంగా మహేష్ బాబుతో నటించిన గుంటూరు కారం సినిమా విషయంలో అయితే హ్యూజ్ ట్రోలింగ్ చేశారు .

అయితే శ్రీ లీల ఏం మాత్రం బాధపడకుండా .. తన స్టడీస్ ను కంటిన్యూ చేస్తుంది. అంతేకాదు ఆమె ఖాళీ సమయాలలో జీమ్‌స్ కి వెళ్తూ వర్కౌట్స్ చేస్తూ ఫ్రెండ్స్ తో టైం పాస్ చేస్తుంది . అయితే ఒకప్పుడు స్టార్ హీరోస్ తో టైం స్పెండ్ చేసిన శ్రీలీల ఇప్పుడు తన ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేసే వరకు వెళ్లిపోయింది అని.. టైం ఎప్పుడు ఎవరికి ఎలా మారిపోతుందో తెలియదు అని దానికి దీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ శ్రీలీల అని చెప్పుకొస్తున్నారు జనాలు..!!