స్టార్ హీరోయిన్ ను వివాహం చేసుకోబోతున్న సిద్దు జొన్న‌లగ‌డ్డ‌.. టిల్లుగాడి క్లారిటీ ఇదే..?!

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డీజే టిల్లు సినిమా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌డంతో ఈ సీక్వెల్‌పై మంచి అంచనాలు నెల‌కొన్నాయి. సిద్దు, డీజె టిల్లు కంటే ముందు పలు సినిమాల్లో నటించినప్పటికీ.. ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక టిల్లు స్క్వేర్ లో అనుపమ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా కోసం అనుపమ బోర్డర్స్ దాటి మరి బోల్డ్ కంటెంట్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ తో ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది.

ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూస్తామా అంటూ.. టిల్లుగాడి ఫ్యాన్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నో ప్రమోషన్స్ లో మూవీటీం హ‌జ‌రై సందడి చేశారు. ఈ క్ర‌మంలో సిద్దు జొన్నలగడ్డకు ఓ ప్రమోషన్ ఈవెంట్ లో లేడీ ఫ్యాన్ నుంచి షాకింగ్ క్వశ్చన్ ఎదురైంది. సదరు అభిమాని సిద్దు జొన్నలగడ్డను ప్రశ్నిస్తూ రీసెంట్ టైమ్స్ లో మీరు స్టార్ హీరోయిని పెళ్లి చేసుకుంటున్నారు అన్న వార్తలను తెగ చూస్తున్నాం ఆ స్టార్ హీరోయిన్ ఎవరు.. అంటూ ప్రశ్నించింది.

దానిపై సిద్దు జొన్నలు స్పందిస్తూ చాలా తెలివిగా రియాక్ట్ అయ్యాడు. ఆ వార్త ఏంటో నాకు అర్థం కావడం లేదు.. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్‌ ఎవరో త‌నకు తెలియదు అంటూ రియాక్ట్ అయ్యాడు. దీంతో సిద్దు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ ను టిల్లు వివాహం చేసుకోబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పడిన‌ట్లైంది.