కాంట్రవర్షియల్ మ్యాటర్ లోకి వేలు పెడుతున్న చరణ్.. వద్దు రా బాబు వద్దు..!

పనీపాటా లేని బ్యాచ్ … ఎప్పుడు మెగా ఫ్యామిలీ పై పడి ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సైలెంట్ గా ఉన్నంతకాలం ఇలాంటి మెగా హేటర్స్ నానావిధాలుగా ట్రోల్ చేస్తూనే ఉంటారు . కాగా రీసెంట్గా రాంచరణ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారింది. మెగా పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న రామ్ చరణ్ త్వరలోనే జనసేన తరపున ప్రచారం చేయబోతున్నాడు అంటూ ఓ వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అయితే రామ్ చరణ్ రాజకీయాల్లోకి రావడం మెగా ఫాన్స్ కి ఇష్టం లేదు . ఆల్రెడీ ఒకసారి మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఎలా నిందలపాలు అయ్యారో అందరికీ తెలిసిందే. రాంచరణ్ ఫాన్స్ మాత్రం ఆయనను రాజకీయాల్లో చూడడానికి ఇష్టపడడం లేదు. అయితే బాబాయ్ కోసం ప్రచారానికి చరణ్ సిద్ధమంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆ పాలిటిక్స్ గోల మనకొద్దు రా బాబు మనం సినిమాలు చేసుకుంటాం ,,ఆ గొబ్బులో నువ్వు వేలు పెట్టొద్దు అంటూ సజెస్ట్ చేస్తున్నారు.

అయితే రామ్ చరణ్ కి కూడా ముందు నుంచి రాజకీయాలపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు . కానీ ఒకవేళ బాబాయ్ అడిగితే కచ్చితంగా నో చెప్పకుండా వెళ్తాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ చరణ్ ని క్యాంపెనింగ్ చేయమంటూ అడుగుతారా..? లేదా,,> అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది..!!