పుష్ప 2 లో ఆ హీరో ని పెట్టడం వెనుక.. బన్నీ హస్తం ఉందా..? ఎందుకంత ప్రేమ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ నటిస్తున్న సినిమా పుష్ప2.. ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నలిచిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది . ఈ మూవీ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాను తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేస్తున్నాడు.  ఈ సినిమా కోసం బన్నీ ఎంత కష్టపడుతున్నాడో మనకు తెలిసిందే.

మరి ముఖ్యంగా బన్నీ పుష్ప  సినిమాలో కనిపించిన తీరు అభిమానులకు బాగా నచ్చేసింది.  ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో కూడా భాగం కాబోతున్నాడు అన్న వార్త వైరల్ గా మారింది . అయితే పెద్ద పెద్ద స్టార్ హీరోలు అడిగినా సరే తెలుగు సినిమాల్లో నటించని ఈ హీరో బన్నీ అడిగి అడగగానే నటించేసాడు అంటూ ప్రచారం జరుగుతుంది . దానికి కారణం బన్నీను బాలీవుడ్ కి తీసుకెళ్లడానికి ఈ స్టార్ హీరో చాలా ట్రై చేస్తున్నారట.

త్వరలోనే బన్నీ ఇతడి కాంబోలో బాలీవుడ్ లో బిగ్ మల్టీస్టారర్ మూవీ కూడా రాబోతుందట . అందుకే బన్నీ స్పెషల్ గా ఆ పాత్ర కోసం ఆ హీరోనే చూస్ చేసుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .చూద్దాం మరి బన్నీ ఏరి కోరి పెట్టుకున్న ఈ హీరో సినిమాకి ఎంత బాగా కలిసి వస్తాడో. ప్రజెంట్ ఈ సినిమా సెట్స్ పై ఉంది . ఆగస్టు 15న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.