మళ్ళీ అదే డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన మహేశ్ బాబు.. ఫ్యాన్స్ కి కొత్త డౌట్లు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు .. ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ స్థానంలో ఉన్నాడో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా రీసెంట్గా ఆయన నటించిన గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అయింది . టాక్ ప్రకారంగా అటు ఇటుగా ఉన్న కలెక్షన్స్ ప్రకారం మాత్రం సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. అయినా సరే సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ ట్రోలింగ్ కి గురయ్యాడు మహేష్ బాబు.

రీసెంట్గా మహేష్ బాబు అనిల్ రావిపూడి తో మరొకసారి చేతులు కలిపాడు. ఆల్రెడీ వీళ్ళ కాంబోలో సరిలేరు నీకెవ్వరు సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . మళ్ళీ అదే అనిల్ రావిపూడి కి ఛాన్స్ ఇవ్వడం ఇప్పుడు అభిమానులకు కొత్త డౌట్లు పుట్టిస్తుంది. ప్రెసెంట్ ఒక యాడ్ షూట్ లో వీళ్ళు బిజీగా ఉన్నారు . అయితే ఇప్పుడు యాడ్ తో సరిపెట్టుకున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ మహేష్ బాబుతో రెండో సినిమాను తెరకెక్కించిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్.

చూద్దాం మరి వీళ్ళ కాంబోలో రెండో సినిమా ఎప్పుడు వస్తుందో..? వస్తే ఎలాంటి హిట్ అందుకుంటుందో..? ఫ్యాన్స్ అయితే ఈ కాంబో కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళితో ఓ భారీ అడ్వెంచర్స్ సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమా ఖచ్చితంగా గ్లోబల్ స్థాయిలో మహేష్ బాబుకి గుర్తింపు తీసుకొస్తుంది అనడంలో సందేహం లేదు..!!