“నాకు ఆ అమ్మాయి బాగా నచ్చేసింది”.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

రాజమౌళి .. ఈ మధ్యకాలంలో బాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు . ఒకప్పుడు రాజమౌళి ఇంత యాక్టివ్ గా సోషల్ మీడియాలో ఉండేవాడు కాదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా హిట్ తర్వాత గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న తర్వాత రాజమౌళి బాగా యాక్టివ్ గా ఉంటున్నారు . రీసెంట్గా రాజమౌళి హీరోయిన్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

మలయాళం లో సూపర్ హిట్ అయిన ప్రేమలు సినిమా నేడు తెలుగులో కూడా రిలీజ్ అయింది . గిరీష్ దర్శకత్వంలో ముస్లిం గపూర్.. మమత బైజు మెయిన్ లీడ్స్ లో ఈ సినిమా తెరకెక్కింది .ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమా గురించి రాజమౌళి ఓ రివ్యూ ఇచ్చాడు . రివ్యూ తో పాటు తన మనసులోని మాటను కూడా బయటపెట్టేసాడు .

“ప్రేమలు సినిమా గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు .. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది . యూత్ కి తగ్గట్టు మీమ్‌స్.. యూత్ లాంగ్వేజ్ లో రైటింగ్ పర్ఫెక్ట్ గా ఉంది ..ట్రైలర్ చూసినప్పటినుంచి ఈ సినిమాలో రీను పాత్రకి నేను ఫ్యాన్ అయిపోయాను ..బాగా నచ్చేసింది సచిన్ పాత్ర చేసిన అబ్బాయి కూడా మెప్పించాడు ..కానీ నాకు ఈ సినిమాలో ఆది పాత్ర బాగా నచ్చింది అంటూ రివ్యూ ఇచ్చాడు”. ప్రెసెంట్ రాజమౌళి రివ్యూ వైరల్ గా మారింది. ఈ సినిమా అభిమానులకు కూడా బాగా కనెక్ట్ అయింది . ఈ సినిమా లో హీరోయిన్గా నటించిన మమత బైజు.. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో డైలాగ్స్ తో అందరిని ఆకట్టుకునింది..!!