అమ్మ బాబోయ్.. కల్కి లో ప్రభాస్ పేరు భైరవ అని పెట్టింది అందుకా..? మాములులోడు కాదు వీడు..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న సినిమా కల్కి . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారో.. ఎంత చెప్పుకున్నా తక్కువే . లేడీ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ఈ సినిమాలో మనం ఎప్పుడూ చూడని డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు ప్రభాస్ అంటూ ప్రచారం జరుగుతుంది .

అంతేకాదు ఇప్పటివరకు కల్కి సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకునేలా చేశాయి . రీసెంట్గా ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ నేమ్ ను రివిల్ చేశారు మేకర్స్ . ఈ సినిమాలో ప్రభాస్ మనకు భైరవ అనే పాత్రలో కనిపించబోతున్నాడు . అంతేకాదు కొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ క్రమంలోనే అసలు ప్రభాస్ పాత్రకు భైరవ అని పేరు పెట్టింది ఎవరు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది .

ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కి పేరు పెట్టడానికి బాగా ఆలోచిస్తున్నా మూమెంట్లో ప్రభాస్ – నాగ్ అశ్వీన్.. రాజమౌళి హెల్ప్ తీసుకున్నారట. స్టోరీ ప్రకారం భైరవ అని పెడితేబాగుంటుంది అంటూ సజెస్ట్ చేశారట. అంతేకాదు ప్రభాస్ లుక్స్ కి భైరవ అనే పేరు చాలా డిఫరెంట్ గా ఉంది అని రాజమౌళి సజెషన్ ఈ సినిమాకి కచ్చితంగా హెల్ప్ అవుతుంది అని ఫాన్స్ ఓ రేంజ్ లో ఈ పోస్టర్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!