రామ్ చరణ్ – జాన్వి కాంబోపై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే..?!

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీయారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలోగా నటిస్తున‌ సినిమా కావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. అయితే రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత ఉప్పెనా ఫేమ్ బుచ్చిబాబు సనాతో తన 16వ సినిమాను నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ RC16 లో రామ్‌చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుందని అఫీషియల్ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి జాన్వి కపూర్ – రామ్‌చరణ్ జంటపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. గతంలో చిరంజీవి ఖైదీ నెంబర్ 150 ప్రమోషన్స్ టైం లో రామ్ చరణ్ తో మీ మూవీ ఏదైనా మ‌ళ్ళీ తీయాలంటే ఏ సినిమాని తీస్తారు అనగా.. జగదీక వీరుడు అతిలోకసుందరి అని వివ‌రించాడు.

Janhvi Kapoor roped opposite Ram Charan in Buchi Babu Sana's ...

మరి అందులో శ్రీదేవి గారి పాత్రకు రీప్లేస్మెంట్గా ఏ హీరోయిన్ ఉంచాలనుకుంటున్నారు అంటే.. నా పాత్రకు రామ్ చరణ్ ఉన్నప్పుడు.. శ్రీదేవి పాత్రకు సీక్వెల్లో ఆమె కూతురు జాన్వి కపూర్ కాకుండా ఇంకెవరైతే బాగుంటుంది జాన్వి కపూర్ – రామ్ చరణ్ కలిసి నటిస్తే బాగుంటుంది.. వారిద్దరికీ కాంబో ఓసారి చూడాలని ఉంది అంటూ చిరంజీవి కామెంట్స్ చేశారు. అయితే చిరంజీవి మొదటి సూచించినట్లు జగదేకవీరుడు అతిలోకసుందరీ మూవీ కాకపోయినా వీరిద్దరి కలయిక ఇండస్ట్రీలోను, అభిమానుల్లోనూ ఆసక్తి రేపుతుంది. ఈ సినిమా ఉత్తరాంధ్ర పల్లెటూరి నేపథ్యంలో సాగే స్టోరీ అని తెలుస్తుంది. ప్రముఖ ఆటోగ్రాఫర్ రత్న వేలు విజువల్స్ తీయడం ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సౌండ్ ట్రాక్ కంపోజ్ చేస్తున్నారు.

RC 16: Ram Charan announces new film! "Telugu Movies, Music, Reviews and  Latest News"

ఇక ఈ సినిమా ఇంకా సెట్స్‌పై కైనా రాకముందే ఈ సినిమా అప్డేట్స్ ఏవైనా బయటకి వస్తే బాగుండని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక చరణ్ తన ఇద్దరు ప్రాజెక్టులతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ప్రస్తుతం చరణ్ గేమ్‌చేంజర్‌ సినిమాలో నటిస్తుంటే.. మరో పక్కన జాన్వి కపూర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ తర్వాత చరణ్‌తో జోడి కడుతుండడంతో ఇది తెలుగులో ఆమెకు రెండో సినిమాగా చెప్పవచ్చు. అయితే ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్, చరణ్ ఇద్దరితోనూ ఒకరి తర్వాత ఒకరితో వరుస ఆఫర్లను అందుకోవడం అంటే జాన్వి కపూర్ ఎంత లక్కీ ఫెలోనో చెప్పవచ్చు. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆమె ఫేట్ మారిపోతుంది అనడంలో సందేహం లేదు. కాగా మరో పక్కన పుష్ప 2 సినిమాలో జాన్వీ ఐటమ్ సాంగ్ లో చేయనుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిని మేకర్స్ అనౌన్స్ చేస్తే గాని క్లారిటీ రాదు.