పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్.. ఇకనుంచి నా పేరు అదే అంటున్న మెగా హీరో..

మెగా హీరో సాయి ధరంతేజ్ కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన.. తన నటనతో సత్తా చాటుకుని తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక కొంతకాలం క్రితం సాయి ధరంతేజ్ తీవ్రమైన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన తర్వాత నుంచి సాయి ధరంతేజ్ పేరు నెట్టింట‌ సాయి తేజ్‌గా వైర‌ల్‌ అవుతుంది. ఇప్పుడు తన పేరులో మరో కొత్త పదాన్ని యాడ్ చేసుకున్నాడు సాయి ధరంతేజ్.

Sai Dharam Tej Shortfilm Satya Releasing Today | cinejosh.com

ఉమెన్స్ డే సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో సాయి తేజ.. స్వాతి జంటగా నటించిన ఒక ఇండిపెండెంట్ ఫిలింను మీడియా ప్రతినిధులకు స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించారు మేకర్స్. తరువాత మీడియాతో మాట్లాడుతూ సాయి ధ‌రం తేజ్ ఓ విష‌యాని తెలియజేశాడు. తన పేరులో ఒక చిన్న మార్పు చేస్తున్నామని.. ఇక నుంచి నా పేరులో తల్లి దుర్గ పేరును యాడ్ చేసుకున్నానని వివరించాడు. తన తండ్రి పేరు ఎలాగో ఇంటి పేరుతో తనకు వచ్చేసిందని.. కానీ తల్లి పేరు దూరం చేసుకోవాలని ఉద్దేశం నాకు లేదు అంటూ వివరించాడు.

SATYA INTERVIEW | DIL RAJU , SAI DHARAM TEJ , NAVEEN , SRUTHI , SAKETH . -  YouTube

దీంతో తల్లి దుర్గ పేరును కూడా ఆయన పేరుతో యాడ్ చేసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. గతంలో సత్య అనే ఇండిపెండెంట్ ఫిలిం నుంచి ఒక సాంగ్ రిలీజ్ కాగా దానికి ఎంతో మంది ప్రశంసలు దక్కాయి. సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ విజయకృష్ణ ఈ ఇండిపెండెంట్ ఫిలిం కి డైరెక్టర్ గా వ్యవహరించాడు. అయితే ప్రస్తుతం సాయి ధరంతేజ్‌ తన పేరులో దుర్గా అనే పేరును కూడా చేర్చుకున్నాను అంటూ చేసిన కామెంట్స్ నెట్టింట‌ వైరల్ గా మారాయి.