NBK109 గ్లింప్స్: క్రేజీ మ్యాటర్ లీక్ చేసేసిన బాబీ..బాలయ్య ఫ్యాన్స్ టూ ఇంటెలిజెంట్స్ రా బాబు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసింహం గా బాగా క్రేజ్ సంపాదించుకున్న బాలయ్య తాజాగా నటిస్తున్న సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . మరి ముఖ్యంగా వాల్తేరు వీరయ్య లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత టైం తీసుకొని మరి బాబీ తెరకెక్కిస్తున్నా మూవీ ఇదే కావడం గమనార్హం . ఈ సినిమా కోసం బాలయ్య కూడా బాగా కష్టపడుతున్నాడు. ప్రజెంట్ పాలిటిక్స్ పనుల్లో బిజీగా మారి ఈ సినిమాకు షూటింగ్ కు బ్రేక్ చెప్పారు.

రీసెంట్గా మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ సినిమా గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంటుంది . మరి ముఖ్యంగా చాలా సరికొత్త డిఫరెంట్ లుక్ లో బాలయ్యను మనం చూడబోతున్నాం అంటూ చిన్న గ్లింప్స్ తోనే అర్థం అయిపోతుంది . గ్లింప్స్ స్టార్టింగ్ లో “ఓ అగ్ని లావా లాగా బాలయ్య పేరు డిజైన్ చేస్తారు “.

అంతేకాదు విలన్ వచ్చి ..”ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా ..? అని అడగ్గా .. బాలయ్య సింహం నక్క మీద దూకుతుంటే వార్ అంటావ్ ఏంట్రా లఫూట్ ..అది హంటింగ్ అంటూ చెప్పుకొస్తాడు . ఈ డైలాగ్ బాగా వైరల్ గా మారింది. బాలయ్య అభిమానులు ఈ డైలాగ్ ను బాగా బాగా ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో బాబి తెలిసో తెలియకో ఓ క్రేజీ మ్యాటర్ లీక్ చేసేసాడు . బాలయ్య మందు తాగితే కానీ ఏ డైలాగ్ చెప్పడు. దీంతో బాలయ్యకు ఈ సినిమాల్లో మందు పిచ్చి బాగా ఉంటుంది అంటూ గెస్ చేసేసారు నందమూరి అభిమానులు . ప్రజెంట్ ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..!!