పెళ్లి ఊసే లేదంటూ.. సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన తాప్సి..

స్టార్ బ్యూటీ తాప్సీ ఫ్యాన్స్ కు ఒక్కసారిగా సడన్ షాక్ ఇచ్చింది. చాలా కాలంగా తాప్సి మ్యాతీస్‌ అనే బ్యాట్మెంటన్ ప్లేయర్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల నుంచి వీరిద్దరూ ప్రేమాయణం నడుపుతున్నార‌ని తాప్సీ ఇటీవ‌ల స్వ‌యంగా ప్ర‌క‌టించింది. ఇలాంటి క్రమంలో త్వరలోనే ఆమె వివాహం చేసుకోబోతుంది అంటూ పలు వార్తలు నెటింట‌ వైరల్ అయ్యాయి. అయితే వాటిని ఖండించుకుంటూ వచ్చిన తాప్సి.. ఇప్పటిలో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్య‌మే లేదంటూ సమాధానం ఇచ్చింది. అయితే ఒక్కసారిగా సీక్రెట్ పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Who is Taapsee Pannu's husband Mathias Boe? Here's how the newlyweds met -  The Week

తాజాగా వివాహం చేసుకొని ఫాన్స్ కు స్వీట్ షాక్‌ తగిలేలా చేసిన‌ తాప్సి.. మార్చ్ 23న ఉదయపూర్ లో చాలా సింపుల్ గా వివాహం జ‌రుపుకుంది. అత్యంత రహస్యంగా ఈ పెళ్లిని ఇరువురి కుటుంబ సభ్యులు, కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యన హ్యాపీగా జరుపుకున్నారు. ఇక వీరిద్దరి వివాహం జరిగినట్టు తాజాగా జాతీయ మీడియాల వార్తలు వైరల్ అయ్యాయి. తాప్సి చాలా తక్కువ సార్లు మాత్రమే తన ప్రియుడు మ్యాతీస్‌తో కనిపించింది. ఇక మార్చ్ 20న మొదలైన ఈ మ్యారేజ్ సెలబ్రేషన్స్ 23 తో ఎండ్ అయ్యాయట. తాప్సి పెళ్లికి హాజరైన వారిలో అతి తక్కువ మంది సెలబ్రిటీస్ మాత్రమే ఉన్నారు. వారిలో తాప్సికి ఎంతో క్లోజ్ ప్రెండ్‌ అయినా అనురాగ్ కశ్య‌ప్‌, క‌నికా థిల్లాస్‌ లాంటివారు సందడి చేశారు.

ఇక తప్పాడ్‌ సినిమాలో తాప్సికి కోస్టార్ గా నటించినా పావైల్ గులాబీ కూడా ఈ వేడుకల్లో హాజరై సందడి చేశాడు. తాప్సి పెళ్లి జరుగుతున్న ప్రదేశం నుంచి అతడు ఒక ఫోటో సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అసలు మేము ఎక్కడ ఉన్నామో.. మాకు ఐడియా లేదు అంటూ ట్యాగ్ చేశాడు గులాబీ.. అది కాస్త వైరల్ గా మారింది. పెళ్లి రహస్యంగా చేసుకుంది కానీ.. త్వరలో తాప్సి ముంబైలో గ్రాండ్గా రిసెప్షన్ వేడుక జరుపుకుంటుందట‌.. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనుందని టాక్‌. ఇక ఈ జంటకు పెళ్లి వేడుక మీడియాలో రావడం ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో వీరిద్దరూ ఆ మ్యాటర్ ని సీక్రెట్ గా ఉంచారని తెలుస్తోంది. మొత్తానికి తాప్సి 36 ఏళ్ల వయసులో వివాహ జీవితంలోకి అడుగుపెట్టి ఇల్లాలుగా మారింది.