బిచ్చగాడు అడిగితే డబ్బులు లేవన్న నటి.. అతను చేసిన పనికి ఎవరైనా షాకవ్వాల్సిందే..?!

సాధారణంగా మన దేశంలో బిచ్చగాళ్ళు ఎక్కడ చూసినా ఎదురవుతూనే ఉంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర.. రోడ్డు ఇరువైపులా.. లేదా గుడిమెట్ల దగ్గర.. రైల్వే స్టేషన్, బస్టాండ్ ఇలా ఎక్కడ చూసినా వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. ధర్మం చేయండంటూ బిచ్చం అడుగుతుంటారు. అయితే కొందరు డబ్బులు లేదని చెప్పగానే వెళ్ళిపోతారు. కానీ కొందరు మాత్రం చిల్లర లేదని చెప్పినా వినిపించుకోకుండా డబ్బులు ఇవ్వమని పట్టుబట్టి వదిలకుండా ఇబ్బంది పెడ‌తారు. తాజాగా అలాంటి సంఘటన బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ.. నటి హీన ఖాన్‌కు ఎదురయింది. అయితే ఆ బిచ్చగాడు చేసిన పనికి ఆమె షాక్ అయిందంటూ ఇటీవల వివరించింది.

ఆమె తనకు ఎదురైనా అనుభవాన్ని వివరిస్తూ నేను కారులో వెళుతున్న టైం లో ఓ జంక్షన్ వద్ద రెడ్ సిగ్నల్ పడిందని.. దీంతో కారు అక్కడ ఆసామ‌ని చెప్పుకొచ్చింది. గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్న టైంలో ఓ వ్యక్తి వచ్చి నా కారు విండో తట్టాడని.. డబ్బులు ఇవ్వమని అడగగా.. నా దగ్గర క్యాష్ లేదని వివరించాన‌ని.. అతడు వెంటనే ఈరోజు ఉదయం నుంచి బోనీ కాలేదు.. ఇంట్లో తమ్ముడు, చెల్లి అలానే ఉన్నారు అంటూ బ్రతిమాలాడని చెప్పుకొచ్చింది. అయితే ఆమె దగ్గర నిజంగానే డబ్బులు లేకపోవడంతో సారీ కూడా చెప్పిందట. అతడు వెంటనే గూగుల్ పే చేయండి అంటూ తన నెంబర్ ఇచ్చాడని.. నేను ఒక్కసారిగా షాక్ అయ్యానంటూ చెప్పుకొచ్చింది.

ఓ వారం రేషన్‌కు సరిపడా డబ్బులు పంపించమని అడిగాడని.. వెంటనే అతడికి అవసరమయ్యేంత డబ్బు యూపీఐ ద్వారా షేర్ చేశానని.. కానీ నిజంగా నాకు ఆశ్చర్యంగా అనిపించింది. డిజిటల్ ఇండియా అంటే మరి ఇంతగా మారిందా అంటూ హీనా ఖాన్‌ ఆశ్చర్యపోయిందట. ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ నెటింట తెగ వైరల్‌గా మారింది. కొందరు దీనిపై కామెడీగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం యూపీఐ ట్రాన్సాక్షన్ మెయింటైన్ చేసే లెవెల్ లో ఆ బిచ్చగాడు ఉన్నాడు అంటే వాడిని మీరు నమ్మి మళ్ళీ డబ్బులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.