తారక్, ప్రశాంత్ కాంబో పై ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. అదేంటంటే..?!

కేజిఎఫ్ సిరీస్‌లతో భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు ప్రశాంత్ నీల్‌. ప్రస్తుతం సౌత్‌ స్టార్‌ డైరెక్టర్గా దూసుకుపోతున్న ప్రశాంత్ నిల్.. కన్నడ భాష నుంచి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా రూ.1700 కోట్ల కలెక్షన్లను రాబట్టిన సినిమా కేజిఎఫ్ చాప్టర్ 2 తో రికార్డును సృష్టించాడు. ఈ మూవీతో ప్రశాంత్, హీరో యష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇకపోతే ప్రశాంత్ నీల్ గతేడాది చివరిలో.. పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్‌ను కూడా ప్రశాంత్ నీల్ రూపొందించనున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు.

ఇక గ‌తేడాది చివర్లో రిలీజ్ అయిన సలార్ పార్ట్ 1 బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ సాధించి రూ.700 కోట్లకు పైగా గ్రాస్ వ‌సుళ‌ను కల్లగొట్టింది. పార్ట్ 2 తో రూ.1000 కోట్లు కలెక్షన్లను రాబట్టడం ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక దీని తర్వాత ప్రశాంత్ నీల్‌, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా రానున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి రానుందట. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. కేజిఎఫ్ మాదిరిగానే హై వోల్టేజ్ పవర్ యాక్షన్ కథతో ఈ సినిమా రూపొందుతుందట.

 

ఇండియన్ మైథాలజీలో క్యారెక్టర్స్ ను స్ఫూర్తిగా తీసుకొని ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా భారీ బడ్జెట్ తో రూపొందుతుందట. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు. కచ్చితంగా తారక్.. కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా ప్రశాంత్ నీల్ ఈ కథను రూపొందిస్తున్నాడని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తుది దశకు చేరుకుంది. దీని తర్వాత హిందీలో వార్‌2 సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు తారక్. ఇందులో నెగటివ్ షేడ్స్‌లో నటించబోతున్నాడట. దీని తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.