చరణ్‌ బర్త్డే ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. తిరుపతిలో మెగా ప్రిన్స్ ఫేస్ రివిల్.. (వీడియో)..!!

నేడు గ్లోబల్ స్టార్ రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన కూతురు, భార్యతో కలిసి తిరుపతికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే తెల్లవారుజామున తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేసుకుని సుప్రభాత సేవలో పాల్గొనేందుకు ఉపాసన‌, రామ్ చరణ్ కుటుంబంతో క‌లిసి వెళ్ళారు. ఇక ఈ జంట వెంకన్న స్వామి దర్శనం చేసుకున్న తర్వాత.. రామ్ చరణ్, ఉపాసనలకు తీర్థప్రసాదాలు అందించారు. అంతే కాదు రామ్ చరణ్ తన కూతురు క్లిన్‌కారకు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించాడు.

అయితే ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్.. రామ్ చరణ్ తిరుపతిలో ఉన్నాడని తెలుసుకొని.. అక్కడికి భారీ ఎత్తున వచ్చి సందడి చేశారు. చరణ్ ఆలయానికి వెళుతుండగా పుట్టినరోజు విషెస్ తెలియజేస్తూ రోడ్లపై సందడి చేశారు అభిమానులు. ఇక రామ్ చరణ్, ఉపాసన దంపతులు కలిసి దర్శనం చేసుకుంటున్నా క్రమంలో ఉపాసన ఒడిలో ఉన్న క్లీన్‌కార ఫేస్ కెమెరాకు చిక్కింది. అది కనిపెట్టిన ఉపాసన కొంతసేపటికి క్లాత్ కప్పి కవర్ చేసేసింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో క్లీన్‌కారకు సంబంధించిన ఈ ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్ గా మారాయి.

దీంతో మెగా ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్లిన్‌కార ఫేస్ చూసి ఆనంద పడిపోతున్నారు. ఆ పాప పుట్టినప్పటినుంచి ఎన్నిసార్లు అడిగినా మెగా ఫ్యామిలీ క్లీన్ కార ఫేస్‌ను రివిల్ చేయలేదు. కానీ రాంచరణ్ పుట్టిన రోజున అన్ఎక్స్పెక్టెడ్ గా క్లీన్ కార ఫేస్ కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చరణ్ అన్న పుట్టినరోజునే వారసురాలు ఫేస్ చూడడం మాకు చాలా ఆనందంగా ఉందని.. అలాగే పాప చాలా చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అని మా అన్న పోలికలే అంటూ వివరిస్తున్నారు.