జూనియర్ ఎన్టీఆర్ ను టార్చర్ చేసిన స్టార్ డైరెక్టర్..లతారక్ అతనికి పెట్టిన నిక్ నేమ్ వింటే నవ్వేస్తారు..?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియాలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న తారక్.. ఎంతో ఎనర్జిటిక్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేసే హీరో మరొకరు ఉండరు అంటూ ఇప్పటికే చాలామంది చెప్తూ ఉంటారు. తారక్ సెట్ లో ఉంటే హడావిడిగా ఉంటుందని అంతా ఎంజాయ్ చేశ్తార‌ని దర్శకులే స్వయంగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తనతో సినిమా తీసిన ప్రతి ఒక్క డైరెక్టర్ కి ఏదో ఒక నిక్ నేమ్ పెడుతూ వస్తారు.

వాళ్ళ బిహేవియర్‌ను బట్టి వాళ్ళు సెట్‌లో చేసే పనిని బట్టి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పేరును పెడతాడు. ఇందులో భాగంగానే బాల రామాయణం సినిమా డైరెక్టర్ గుణశేఖర్ కి కూడా ఆ టైంలో ఓ నిక్ నేమ్ తో పిలుస్తూ ఉండేవాడట తారక్. బాల రామాయణం సినిమా షూటింగ్ టైంకి కేవలం ఎన్టీఆర్ వయసు 10 ఏళ్ళు. చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఈ సినిమాతో ఎంతమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే గుణశేఖర్ ఈ సినిమా షూటింగ్ టైంలో ఎన్టీఆర్‌ను బెదిరించి మరీ చాలా సార్లు యాక్టింగ్ చేయించుకున్నట్లు తారక్ స్వయంగా వివరించాడు.

ఇక ఆ సినిమాతో ఎన్టీఆర్ కు మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమాలో నటించి మెప్పించిన ఎన్టీఆర్ కు తర్వాత హీరోగా ఛాన్సులు రావడం సులభమైంది. ఇక గుణశేఖర్.. ఎన్టీఆర్‌ను షూటింగ్ టైంలో పెట్టిన ఇబ్బందులను గుర్తుపెట్టుకొని.. ఆయనను కటకటాల రుద్రయ్య అని నిక్ నేమ్ తో పిలుస్తూ ఉండేవాడట. అయితే ఎన్టీఆర్ యంగ్ ఏజ్ స్టార్ హీరోగా ఫేమ్‌ సంపాదించుకున్న తర్వాత మాత్రం.. గుణశేఖర్ డైరెక్షన్లో ఒక సినిమా కూడా చేయలేదు.