కెరియర్ లో ఏ సినిమా కోసం చేయని పనిని .. పుష్ప2 కోసం చేస్తున్న అల్లు అర్జున్..!!

అల్లు అర్జున్ – బన్నీ – ఐకాన్ స్టార్ – స్టైలిష్ స్టార్ ఒకటా..? రెండ..? ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో ..రకరకాల ట్యాగ్స్ తో ఇండస్ట్రీలో సూపర్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెసెంట్ నటిస్తున్న మూవీ పుష్ప2. ఈ సినిమా కోసమని ఎంత కష్టపడుతున్నాడు అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

ఈ సినిమా ఖచ్చితంగా ఆయన కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. ఒక సపరేట్ మైలురాయిని క్రియేట్ చేస్తుంది. రీసెంట్గా పుష్ప2 సినిమాకి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ స్పెషల్ డైట్ ఫాలో అవుతున్నాడట. ఇప్పటివరకు ఆయన ఇంత కఠినమైన డైట్ ను ఏ సినిమా కోసం కూడా ఫాలో అవ్వలేదట . మరీ ముఖ్యంగా నాన్ వెజ్ దూరంగా డీప్ ఫ్రై ఐటమ్స్ ని పూర్తిగా మానేసి కేవలం సుకుమార్ అపాయింట్ చేసిన డైటీషియన్ పెట్టిన చార్ట్ నే ఫాలో అవుతున్నాడట .

ఉదయం లేవగానే రెండు గ్లాసుల నీళ్లు.. ఆ తర్వాత నానపెట్టిన డ్రై ఫ్రూట్స్.. ఆ తర్వాత రాగిజావ.. స్నాక్ కింద ఫ్రూట్ బౌల్స్.. ఆ తర్వాత లంచ్ లోకి రెండు పుల్కా లేదంటే ఒక కప్పు ఓట్స్ ..ఫుల్ వెజిటేబుల్ కర్రీస్ ..ఆ తర్వాత స్నాక్ కింద డ్రై ఫ్రూట్స్ ..ఆ తర్వాత ఒక కొబ్బరి బొండం.. ఆ తర్వాత డిన్నర్ లోకి సూప్ లేదా లైట్ ఫుడ్ తీసుకొని జిమ్లో వర్కౌట్ చేసి మరి బాడీని ఫిట్గా మార్చేస్తున్నాడట.

అల్లు అర్జున్ మంచి ఫుడీ.. బాగా పుష్టిగా తినే టైప్.. మరి అలాంటి అల్లు అర్జున్ నోరు కట్టేసుకున్నాడు.. అంటే కచ్చితంగా ఈ సినిమా కోసం ఆయన బాగా కష్టపడుతున్నాడని చెప్పాలి చూద్దాం మరి సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..??