ప్రేమంటేనే ఓ మాయ ఊబి అంటూ శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్.. ఏం జరిగిందంటే..?!

లోకనాయకుడు కమల్‌హాసన్ కూతురుగా శృతిహాసన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సినీ రంగంలో అడుగుపెట్టిన అతి త‌క్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరచుకుంది. టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లోనూ రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. దాదాపు తెలుగు అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న నటించి సక్సెస్‌లు అందుకుంది. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా శృతిహాసన్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె ఎనీమోల్ అనే ప్రైవేట్ సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.

ఈ సాంగ్‌లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, శృతిహాసన్ తో కలిసి రొమాన్స్ చేశాడు. ఈ నేపద్యంలో తాజాగా శృతిహాసన్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి. శృతిహాసన్ మాట్లాడుతూ తన జీవితంలో గాఢంగా ప్రేమించిన వ్యక్తి పై ఉన్న అనుబంధం, జీవితం, ప్రేమలో వైఫల్యం వీటన్నిటిని నాలుగే నిమిషాలలో వీడియో సాంగ్ లో చూపించాలని భావించా ముందుగా ఈ పాటని నా పియానో ఇంగ్లీషులో రాశా.. ప్రస్తుత జనరేషన్ మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పాటను రూపొందించా నా ఉద్దేశంలో ప్రేమ ఒక్క ఊబి లాంటిది అంటూ కామెంట్స్ చేసింది.

మనకు షుగర్ మంచిది కాదని తెలిసిన షుగర్ క్యాండినే ఇష్టంగా తింటాం.. అలానే ప్రేమ కూడా అంతే.. అదొక ఊబి అంటూ వివరించింది. ఎనిమోల్‌లో డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్ ఒక నటుడిగా అద్భుతంగా కనిపించనున్నాడు. మెగా ఫోన్ పట్టుకొని కనిపించే ఓ డైరెక్టర్ నటుడిగా మారారు అంటే సహజంగానే జనాల్లో ఆసక్తి ఉంటుంది. అయితే లోకేష్ కనగరాజ్ స్టార్ డైరెక్టర్గా మారిన అనుకువ‌గా ఉండే వ్యక్తి. తనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. డైరెక్షన్ విషయంలో ఆయన ఎంతో క్రియేటివ్ గా ఉంటాడు అంటూ శృతిహాసన్ చెప్పకొచ్చింది. అయితే ప్రస్తుతం శృతిహాసన్ లవ్‌పై చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి.