నోటి దూల అంటే ఇదేగా.. “సలార్ ” సినిమా పై విశ్వక్ సేన్ కాంట్రవర్షియల్ కామెంట్స్(వీడియో)..!!

పాపం.. ఈ మధ్యకాలంలో విశ్వక్ సేన్ ఏం మాట్లాడినా ..పెద్ద రాద్ధాంతం చేసేస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ఓ బ్యాచ్ విశ్వక్ సేన్ ను బాగా టార్గెట్ చేసింది . ఆయన మంచి మాట్లాడిన చెడు మాట్లాడిన పొరపాటున ఏదైనా టంగ్ స్లిప్ అయినా .. చిక్కిందే ఛాన్స్ అన్నట్టు ఏకిపారేస్తున్నారు . విశ్వక్ సేన్ కూడా ముందు వెనక ఆలోచించుకోకుండా మాట్లాడేస్తూ ఉండడం ఆయన అభిమానులను సైతం హర్టింగా అనిపిస్తుంది.

రీసెంట్గా విశ్వక్సేన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మాస్ కా దాస్ గా పాపులారిటీ సంపాదించుకున్న విశ్వక్ సేన్ ప్రెసెంట్ నటిస్తున్న సినిమా “గామీ”. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మార్చి 8న గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు విశ్వక్ సేన్ అభిమానులు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు విశ్వక్ సేన్.

రీసెంట్గా చిత్ర బృందం మీడియాతో ముచ్చటించింది . ఈ క్రమంలోనే పొరపాటున విశ్వక్ సేన్..అనుకోని కాంట్రవర్షియల్లో చిక్కుకున్నాడు . మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చిన విశ్వక్ మధ్యలో “సైలెంట్ గా ఉంటేనే ఎక్కువగా డబ్బులు వస్తున్నాయి” అన్న డైలాగ్ కొడతాడు. దీంతో వెంటనే రిపోర్టర్ ..”మీరు సలార్ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా బ్రో..?” అంటూ క్వశ్చన్ చేస్తాడు. ” ఇప్పుడేంటి నాలుగేళ్ల క్రిందట ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం “అంటూ నవ్వుతూనే సమాధానం ఇస్తాడు విశ్వక్సేన్ .

అయితే ఇది ప్రభాస్ అభిమానులను కొంచెం హర్ట్ చేస్తుంది . ప్రభాస్ తన సినిమాలకు ప్రమోషన్స్ చేయకపోయినా సినిమాలు హిట్ అవుతున్నాయి అని.. పరోక్షకంగా కౌంటర్ వేశాడు అంటున్నారు విశ్వక్ సేన్ యాంటీ ఫ్యాన్స్ . అంతేకాదు దీనికి కొంచెం మాస్ మసాలా యాడ్ చేసి విశ్వక్ సేన్ ను ట్రోల్ చేస్తున్నారు . కొందరు నోటి దూల అంటుంటే మరికొందరు హెడ్ వెయిట్ అంటూ ఆయన మాటలను వ్యంగంగా చిత్రీకరిస్తున్నారు..!!