కెమెరా కంట పడకుండా మాస్క్ వేసుకుని జంపైన అనుష్క.. కారణం అదేనా..?

ఒకప్ప‌టి టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి కి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఫ్యాన్స్ అంతా ఇమెను ముద్దుగా స్వీటీ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇక పేరుకు తగ్గట్టుగానే స్వీట్ స్వీట్ గా మాట్లాడుతూ నటన, ఆభినయంతో అందరిని ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా ఏ సినిమాలోని నటించడం లేదు. ఇక ఇటీవల మిస్ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి సినిమాతో సందడి చేసింది. ఆ తర్వాత మరే సినిమాను ఆమె సైన్ చేయలేదు. సినిమాలతోనే కాదు మామూలుగా కూడా అనుష్క బయట కనిపించడం మానేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె హోటల్లో కనిపించింది.

అయితే తనను ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి మాస్క్ ధరించి.. మరోవైపు ఫుట్‌ డ్రెస్, డేనిమ్ జాకెట్ వేసుకుని తనను ఎవరు గుర్తుపట్టకుండా వెయిట్ ని కవర్ చేసుకునే విధంగా బట్టలు ధరించింది. ఇక హోటల్ నుంచి బయటకు వచ్చిన ఆమె కెమెరాలతో ఫొటోస్ తీస్తున్నారని తెలిసి వెంటనే ఫాస్ట్ ఫాస్ట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ ఫొటోస్ లో, వీడియోలో ఆమె లావుగా కనిపిస్తుంది. లుక్ కనిపించకుండా మేనేజ్ చేస్తున్నప్పటికీ కాస్త తెలుస్తుంది.

ఇక ఈ వీడియో పై నెట్టిజ‌న‌క‌లు స్పందిస్తూ ఆమె లావుగా ఉన్న క్యూట్ గానే ఉంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం కే.రాఘవేంద్ర తనయుడు ప్రకాష్ కోవెలమూడి కారణంగానే ఆమె అలా మారిందని.. ఆ సైజ్ జీరో సినిమాను నటించకపోయి ఉంటే ఆమెకు ఇప్పటికీ కూడా అదే క్రేజ్‌ ఉండేదని వారిపై ఫైర్ అవుతున్నారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచి ఆమ్మ‌డి కష్టానికి ఫలితం లేకుండా పోయింది. ఈ సినిమా తర్వాత బరువు కంట్రోల్ చేయలేకపోవడంతో అనారోగ్యానికి కారణమైంది.

అలాగే బరువు తగ్గకపోవడంతో అనుష్క బయటకు రావడం కూడా మానేసింది. భాగమతి మూవీ తర్వాత పూర్తిగా మీడియాకు దూరమైన స్వీటి మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి ప్రమోషన్స్ లో కూడా కనిపించలేదు. అయితే ఈ సినిమా రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో ఇలాంటి డెసిషన్ తీసుకొని సైజ్ జీరో కష్టాలను స్వయంగా అనుష్క కొన్ని తెచ్చుకుంది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.