అభిమానులకు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్.. పుష్ప2కు మరో భారీ బొక్క..కోలుకోలేని షాక్..!

ప్రజెంట్ కోట్లాదిమంది అభిమానులు ఎంత ఈగర్ గా పుష్ప2 సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమానే ఈ పుష్ప2. గతంలో ఆయన నటించిన పుష్ప వన్ సినిమాకి ఈ మూవీ సీక్వెల్ గా రాబోతుంది . ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా షూట్ ను చకచగా కంప్లీట్ చేస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్ .

ఈ సినిమాలో గంగమ్మ తల్లి జాతర సీన్స్ హైలైట్ గా ఉండబోతున్నాయి అంటూ ఇప్పటికే వార్తలు వినిపించాయి . అయితే సినిమా షూట్ నుంచి కొన్ని పిక్చర్స్ లీకై వైరల్ అవుతూ ఉండడం బన్నీ అభిమానులకు కంగారు పెట్టిస్తుంది. రీసెంట్గా అల్లు అర్జున్ శారీ తో కనిపించిన లుక్ ఎలా వైరల్ అయిందో మనం చూసాం . తాజాగా పుష్ప2 నుంచి మరొక పోస్టర్ లీక్ అయి వైరల్ గా మారింది .

పుష్ప సినిమాలో ఎంపీ భూమిరెడ్డి సిద్ధప్ప నాయుడు పాత్రలో కనిపిస్తాడు రావు రమేష్ . ఎర్రచందనం సిండికేట్ బిజినెస్ . పుష్ప పార్ట్1 లో ఈ సిండికేట్ ని పుష్ప చేతికి అప్పగించేస్తాడు సిద్ధప్ప నాయుడు .ప్రజెంట్ దానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది . అయితే ఎవరో కొందరు ఆకతాయిలో షూటింగ్స్ పార్ట్ నుంచి రావు రమేష్ ప్రజా చైతన్య పార్టీ అనే ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో లీక్ చేసేసారు. దీంతో ఫాన్స్ కంగారుపడుతున్నారు . సినిమా రిలీజ్ కి ముందే మొత్తం లీక్ చేసేస్తారా ..?అంటూ మండిపడుతున్నారు . దీంతో పుష్ప సినిమాకి మరో భారీ బొక్క పడినట్లు అయ్యింది..!!