బిగ్ బ్రేకింగ్: పవన్ కళ్యాణ్ జాన్ జిగిడి దోస్త్ బండ్ల గణేష్ కు జైలు శిక్ష.. కోర్టు సంచలన తీర్పు..ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో .. సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కు కోర్టు జైలు శిక్ష విధించిందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బండ్ల గణేష్ మొదట కమెడియన్ గా తన కెరియర్ను ప్రారంభించి తనదైన స్టైల్ లో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు.

ఆ తర్వాత యాక్టింగ్ నుంచి నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించి హ్యూజ్ ప్రాఫిట్స్ అందుకున్నారు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాను నిర్మించింది బండ్ల గణేష్. ఆ తర్వాత పొలిటికల్ పరంగా కూడా కొన్ని సార్లు వేలు పెట్టి తిట్టించుకున్నారు.. బూతులు తిట్టారు. ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్గా బండ్ల గణేష్ కు జైలు శిక్ష విధించిన న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు ఇచ్చిన తీర్పు అప్పీల్ చేసుకునేందుకు నెలరోజుల గడువు కూడా ఇచ్చింది . వెంకటేశ్వర్లు అనే వ్యక్తి బండ్ల గణేష్ నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ నుండి ఇచ్చిన చెక్ బౌన్స్ అయిన కారణంగా కోర్టులో కేసు వేశారు . ఆ కేసుకు సంబంధించిన అవకతవకల విషయంలో 95 లక్షల జరిమానా విధించడంతో పాటు ఆయనకు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట ఇంత వైరల్ గా మారింది..!!