మహేష్ బాబు ఫోన్ చేసి మరి ప్రభాస్ కు సజెస్ట్ చేసిన ఆ సినిమా ఏంటో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ళ వద్దకు వచ్చిన కథలను కొన్నిసార్లు రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఎక్క‌డైనా సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు కథ నచ్చినా.. డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆ క్యారెక్టర్ తమకు సెట్ అవ్వదు అనే ఉద్దేశంతో సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ వారి ద‌గ్గ‌ర‌కు వచ్చిన ఆ స్టోరీ సెట్ కాకుంటే మరో హీరోకు బాగా సెట్ అవుతుందంటూ సజెస్ట్ చేసే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ ఒకడు.

గతంలో మహేష్ బాబు దగ్గరకు ప్రొడ్యూసర్ దిల్ రాజుచ‌ డైరెక్టర్ ధ‌శ‌ర‌ధ్‌ ఇద్దరు కలిసి వెళ్లి మిస్టర్ పర్ఫెక్ట్ కథను వినిపించారట. ఈ సినిమా కథ విన్న మహేష్ బాబు ఈ సినిమాకు నేను సూట్ అవ్వను.. అయితే ఈ సినిమాకు ప్రభాస్ చాలా అద్భుతంగా సెట్ అవుతాడు అంటూ సజెస్ట్ చేశాడట. దీంతో డైరెక్టర్ తో కలిసి దిల్ రాజు ప్రభాస్‌ను అప్రోచ్ అయ్యి ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నారు. అయితే మహేష్ కేవలం దర్శకుడికి, ప్రొడ్యూసర్ కి చెప్పడమే కాకుండా ప్రభాస్ కు ఫోన్ చేసి మరి ఒక కథ వచ్చింది అది కచ్చితంగా మీకు అయితే బాగా సూట్ అవుతుంది అంటూ వివ‌రించాడట‌.

మీరు తప్పకుండా చేయండి అంటూ సలహా ఇచ్చాడట. ఇక మిస్టర్ పర్ఫెక్ట్ కథ విన్న ప్రభాస్‌కి కూడా ఆ స్టోరీ చాలా నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. కాగా ప్రస్తుతం మహేష్ బాబు కారణంగా ప్రభాస్ ఖాతాలో ఇలాంటి మంచి హిట్ చేరింది అన్న న్యూస్ వైర‌ట్ కావ‌టంతో.. ప్రభాస్‌కు ఆ సినిమా సజెస్ట్ చేసినందుకు మహేష్ ను ప్రశంసిస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్‌.