“ముద్దు పెడుతూ”.. ప్రేమ విషయాని బయటపెట్టిన రష్మిక..ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!!

రష్మిక మందన్నా.. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఛలో సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో రాజ్యమేలుస్తుంది . మరి ముఖ్యంగా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బన్నీ -మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశం కొట్టేసి పాన్ ఇండియా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా రష్మిక మందన్నా కెరియర్ని మలుపు తిప్పిన సినిమా అంటే మాత్రం అది పుష్ప అని చెప్పాలి .

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో నటించి మెప్పించింది . ఈ సినిమా తర్వాత రష్మిక ఓ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా మారిపోయింది . రీసెంట్గా వచ్చిన యానిమల్ సినిమా కూడా అమ్మడుకు మంచి మార్కులే వేశాయి . బోల్డ్ పర్ఫామెన్స్ అనిపించింది కానీ.. అందరూ సినిమాని ఎగబడి చూసి 900 కోట్లు కలెక్ట్ చేసేలా చేశారు.

ప్రెసెంట్ పలు సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్నా.. రీసెంట్గా వాలెంటైన్స్ డే కి కొద్ది గంటల ముందు అభిమానులతో మాట్లాడింది . ఈ క్రమంలోనే ఆమె కొన్ని సెల్ఫీ పిక్స్ కూడా షేర్ చేసింది . ఈ సెల్ఫీ పిక్స్ లో ముద్దు పెడుతున్నట్లు నాటి ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చింది రష్మిక మందన్నా. అభిమానులతో ఎప్పుడు చిట్ చాట్ చేస్తూనే ఉంటుంది . అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా రష్మిక నుంచి ఏదైనా బిగ్ గుడ్ న్యూస్ వస్తుంది ఏమో అనుకున్నారు జనాలు .

కానీ అలాంటి గుడ్ న్యూస్ వినిపించలేదు . రష్మిక మందన్నా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ..” చాలా రోజులైంది మీతో మాట్లాడి.. మీ వాలెంటైన్స్ డే ప్లాన్స్ ఏంటి? అందరూ నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ..మీతో మాట్లాడితే ఎనర్జీ వచ్చేస్తుంది “అంటూ చాలా సరదాగా వాలెంటైన్స్ డే గురించి అభిమానులతో ముచ్చటించింది . ప్రజెంట్ దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్ గా మారింది..!!