పవన్ కళ్యాణ్ ” ఓజి ” మూవీకి మరో టైటిల్ రిజిస్టర్.. ఇక ఊచకోత స్టార్ట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మాస్ అండ్ యాక్షన్ మూవీ ” ఓజీ “. ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాకి మరో టైటిల్ కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది. గతంలోనే ఈ సినిమాకి మరో పవర్ఫుల్ టైటిల్ ఉండబోతుందని మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ టైటిల్ ఓజి నే ” ఓజీస్ గంభీర ” అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక పవర్ఫుల్ టైటిల్ ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు ” హంగ్రీ చితా ” నీ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక ఇదే లైన్ ఈ సినిమాకి గాను కంపోజ్ చేసిన థీమ్ సాంగ్లో పెద్ద హైలెట్ అవ్వనుందట. ఇక ఈ క్రమంలోని ఈ టైటిల్ ని మేకర్స్ రిజిస్టర్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ టైటిల్ ని చూసిన ప్రేక్షకులు.. టైటిల్ ఫిక్సయింది ఇక ఊచకోత మొదలెట్టల్సిందే కదా ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.