ఆ క్రేజీ డైరెక్టర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్.. తారక్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పక్క..

టాలీవుడ్ అగ్ర హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈయన పాన్‌ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న దేవర షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. సుమారు రూ.15 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్.. ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ప్ర‌తి నాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు.

షైన్ టామ్ చాకో, రమ్య‌ కృష్ణ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులు ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దేవర ను రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇంత బిజీ ష్కెడ్యుల్ లోను ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నెల్‌ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. దిగ్గజ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, లోకేష్ కనగ‌రాజ్‌ సినిమాలకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స‌మాచారం.

ఏవో కారణాలతో ప్రశాంత్ నీల్‌ సినిమాకు బ్రేకులు వేసిన.. లోకేష్ కనగ‌రాజ్‌ సినిమా పట్టాలెక్కడం ఖాయం అంటూ తెలుస్తుంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విక్రమ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న లోకేష్ కనకరాజ్‌ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టాలీవుడ్‌లో అగ్ర హీరోగా ఉన్న ఎన్టీఆర్ పాన్ఇండియా రేంజ్ లోను దూసుకుపోవడం ఖాయం అంటూ నందమూరి అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.