ఆ దేశంలో రజిని ‘ లాల్ సలాం ‘ బ్యాన్.. కారణం ఇదే..

సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్న మూవీ లాల్ సలాం. ఆయ‌న కుమార్తే ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీవితా రాజ‌శేఖ‌ర్ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తుంది. స్పోర్ట్స్ బేస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మతకల్లోల కథాంశం ప్రధానంగా కనిపించనుంద‌ట‌. అయితే మొదట ఈ సినిమాను సంక్రాంతి బ‌రిలో రిలీజ్ చేయాలని మేకర్స్‌ భావించారు. కానీ కొన్ని పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో.. రిలీజ్ డేట్ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 9న సినిమాను రిలీజ్ చేయ‌నున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటికే సెన్సార్ నిబంధనలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు రిలీజ్ సమస్యలు ఎదురవుతున్నాయని మీడియా వర్గాల సమాచారం. ఇక ఈ మూవీని కూవైట్ దేశంలో బ్యాన్ చేశారట. కువైట్ కి ఇత‌ర దేశాల‌ సినిమాల రిలీజ్ పరంగా రూల్స్ చాలా స్ట్రిట్ గా ఉంటాయి. అక్కడ సినిమాల బ్యాన్ చేయడానికి ఆ సినిమాలో ఉండే కంటెంట్ ప్రధాన కారణం. ఆ దేశాల్లో చాలా ఆంక్షలుతో సినిమాలు రిలీజ్ చేస్తారు. కంటెంట్ ఏ మాత్రం తేడాగా అనిపించిన సినిమాను బ్యాన్ చేసేస్తూ ఉంటారు. అక్కడ ప్రభుత్వాలు ఈ నేపథ్యంలోనే లాల్ సలాం సినిమాని కూడా సెన్సిటివ్ కాన్సెప్ట్ ఉందని.. హిందూ, ముస్లిం ఘర్షణకు సంబంధించిందని అందుకే బ్యాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మిడిల్ వెస్ట్ లో కూడా ఇలాంటి సెన్సిటివ్ సినిమాలు సెన్సార్ కష్టంగానే ఉంటుందట‌. దీంతో ఇక్కడ కూడా సినిమా బ్యాన్‌ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని సమాచారం. ఇక రజనీకాంత్.. లాల్ సలాం సినిమాలో గెస్ట్ రోల్ మాత్ర‌మే చేస్తున్నప్పటికీ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థల లైక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందింది. ఇక ఈ సినిమాకు బిజినెస్ కూడా రజిని ఈ సినిమాలో ఉండడంతోనే భారీగా జరుగుతుందట.