బ్రేకింగ్ : నేను బ్రతికే ఉన్నాను అంటూ వీడియో రిలీజ్ చేసిన పూనమ్ పాండే.. వీడియో వైరల్..

ప్రముఖ న‌టి, మోడల్ పూనామ్ పాండే క్యాన్స‌ర్ కార‌ణంగా చనిపోయినట్లుగా నిన్నటి నుంచి ప‌లు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అందరికీ బిగ్ షాక్ ఇస్తూ పూనామ్‌ స్వయంగా వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ నేను గర్భాసయ్య క్యాన్సర్ తో చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు.. నేను బ్రతికే ఉన్నా అంటూ చెప్పుకొచ్చింది.

Poonam Pandey's beginnings, rise to infamy, and an unconventional career -  Hindustan Times

గర్భసయ‌ కాన్సర్ తో నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు.. కానీ ఈ వ్యాధి ఎలా ఎదుర్కోవాలో తెలియక చాలామంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇతర కాన్సర్లు మాదిరిగా కాకుండా సరైన చికిత్స తీసుకుంటే గర్భసయ‌ కాన్సర్ పూర్తిగా నివారించుకోవచ్చు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ ముందస్తుగా తీసుకుంటే దీన్ని ఎదుర్కోవడం సులభం అవుతుంది అంటూ వివ‌రించింది. ఈ వ్యాధితో ఎవరు తమ ప్రాణాలు కోల్పోకుండా ముందస్తు మార్గాలు వైద్యశాస్త్రంలో ప్రవేశపెట్టారు.

గర్భసయ‌ కాన్సర్ విషయంలో ప్రతి మహిళ తీసుకోవాల్సిన చర్యలు గురించి అందరికీ తెలిసేలా చేయండి అంటూ ఈ వీడియోలో వివరించింది. తన మరణ వార్త విషయంలో అందరూ నన్ను క్షమించాలి.. అని కోరిన పూనమ్ పాండే మహిళల్లో నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న ఈ గర్భాసయ్ క్యాన్సర్ గురించి అందరికీ తెలిసేలా చేయడమే ప్రధాన ఉద్దేశం అంటూ వివరించింది. ఇక ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సిల్ డే కావడంతో దీనిపై అవగాహన కల్పించేందుకు పూనామ్ ఇలాంటి సంఘటనకు పాల్పడిందని తెలుస్తుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)