బాలయ్య బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరిని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ చివరిగా నటించిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెర‌కెక్కిన ఈ సినిమాలో శ్రీ లీల కీలక పాత్రలో, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించి మెప్పించారు. ఈ సినిమా ప్రొడ్యూసర్, డిస్టిబ్యూటర్లను లాభాల బాటలో నడిపించింది. అయితే ఈ సినిమాను కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్ దళపతితో రీమేక్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారట. తాజాగా తమిళ్ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఎన్నికల ముందు తన రాజకీయ కల‌లను పెంచే విధంగా తన ఇమేజ్ బూస్ట్ అప్ చేసుకునేందుకు మహిళా సెంట్రిక్ మూవీలో నటించాలని విజయ్‌ భావించాడట. భగవంత్ కేసరి సినిమా చూసిన తర్వాత మహిళా సాధికారత కోసమే నిలబడే వ్యక్తిగా తనను తాను ఎంచుకోటానికి ఇదిక‌రెక్ట్‌ సినిమా అని అతను ఫీలయినట్లు తెలుస్తుంది. అయితే నిర్మాత డివివి దానయ్య కోరిక మేరకు అనిల్ రావిపూడి విజయ్‌ని కలిసి ఈ సినిమా రీమేక్‌కు సహకరించే అవకాశం గురించి మాట్లాడాడట.

అయితే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదని తెలుస్తోంది. షైన్ స్క్రీన్ బ్యానర్ కూడా ఈ సినిమాలో రీమిక్ చేయాలని భావించిందట. అయితే సరైన సహకారం లేకపోవడంతో ఈ సినిమా రీమేక్ ను చేయాలనే ఆలోచన మేకర్స్ విరమించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం బయటకు రావడంతో బాలయ్య బ్లాక్ బాస్టర్ భగవంత్‌ కేసరి లాంటి సినిమాను విజయ్ మిస్ చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.