చరిత్ర సృష్టించిన ‘ హనుమాన్ ‘.. టాలీవుడ్ లోనే అరుదైన రికార్డ్ ప్రశాంత్ వర్మ సొంతం..

2024 సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ అయిన హనుమాన్ సినిమా బ్లాక్ బ‌స్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సెలబ్రిటీస్, పొలిటిషన్ కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. తేజ సజ్జ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన ఈ సినిమా ఇప్ప‌టికే ఎన్నో రికార్డ్‌లు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ మరో అరుదైన రికార్డ్‌ సొంతం చేసుకుంది. పొంగల్ సీజన్లో రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్లు సాధించిన టాప్ 10 లిస్టులో టాప్ 1గా నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది.

సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల.. ప్రేమతో హనుమాన్ కొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. గత 92 ఏళ్ల టాలీవుడ్ ప్రస్థానంలో ఆల్ టైం సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా హనుమాన్ నిలిచింది అంటూ వివరించాడు. ఇక జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే రూ. 300 కోట్ల కలెక్షన్ రాబట్టే పనిలో బిజీగా ఉంది. మరో రెండో రోజుల్లో ఈ ఫీట్ కూడా సాధించ‌టం ఖాయమంటూ సినీవర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాకి సీక్వెల్ జై హనుమాన్ త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి. ఈ సినిమాలో మెయిన్ లీడ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోను తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతోపాటు ఆఫ్ స్క్రీన్ లో కూడా వారి ఇమేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి.. చూడగానే భక్తి భావం కలగాలి.. ఆ లిస్టులో చిరంజీవి ఒక‌రు. ఆయ‌న ఈ మూవీలో ఉండొచ్చు అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. రాముడిగా తన మనసులో ఉన్న నటుడు మహేష్ బాబు అని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. ఇక పార్ట్ 1 హీరో.. తేజ సజ్జ కూడా పార్ట్ 2లో కనిపించబోతున్నాడు. ఇక హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.