విజయ్ దేవరకొండ ‘ ఫ్యామిలీ స్టార్ ‘ రిలీజ్ అప్పుడే.. మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్..

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు గత కొంతకాలంగా సరైన హిట్ పడలేదన్న సంగతి తెలిసిందే. చివరిగా విజయ్ హీరోగా తెరకెక్కిన ఖుషి సినిమా కూడా అంచనాలను అందుకోలేదు. దీంతో ఓ మంచి సక్సెస్ అందుకోవడం కోసం దేవరకొండ కసితో ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ పరశురామ్‌ డైరెక్షన్‌లో ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు దేవరకొండ. బ్లాక్ బ‌స్టర్ మూవీ గీతగోవిందం తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలను నెలకొన్నాయి.

Parasuram Unhappy With Vijay Deverakonda Family Star | cinejosh.com

ఇక గత కొంతకాలంగా ఫ్యామిలీ స్టార్.. ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. దీనిపై తాజాగా స్పందించిన మేకర్స్ ఈ వార్తలను నిజం చేస్తు ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ వచ్చేస్తున్నాడు.. మా ఫ్యామిలీ స్టార్‌ను ఆహ్వానించేందుకు ఏప్రిల్ 5న సిద్ధంగా ఉండండి అంటూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టీం సోషల్ మీడియా వేదికపై ట్వీట్ చేశారు. దీంతోపాటు విజయ్ దేవరకొండ కొత్త పోస్టర్‌ను టీం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో పక్క ఫ్యామిలీమ్యాన్‌గా విజయ్ ఆకట్టుకున్నాడు. నోటిలో ఆధార్ కార్డ్‌, భుజంపై సంచిత విజయ్ దేవరకొండ ఉన్న ఈ పోస్టర్ తెలుగుతోపాటు, తమిళంలోనూ రిలీజ్‌ చేశారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్‌ ఠాగూర్ నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్కుతుంది. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మొదట అనౌన్స్ చేసిన మేక‌ర్స్ షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. ప్రస్తుతం షూటింగ్ సరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 5నే సినిమా రిలీజ్ చేయనున్నట్లు టీం వివరించింది.

అయితే మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ దేవర ఏప్రిల్ 5వ రిలీజ్ అవుతుంది అని ఈ మూవీ మేకర్స్‌ ప్రకటించారు. అయితే పలు కారణాలతో షూటింగ్ ఆగిపోయిందని.. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 5న సినిమా రిలీజ్ వాయిదా పడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎప్రిల్ 5వ తేదీన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రావడంతో దేవర ప్లేస్ లో దేవరకొండ ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ ఈ వార్తలు తెగ వైరల్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.