చిరు వద్దన్నా వినకుండా ఆ డైరెక్టర్ తో సినిమాకు ఓకే చెప్పిన వెంకీ మామ.. కారణం ఇదే..

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ స్టార్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. ఇప్పటివరకు ఆయన తర్కెక్కించిన సినిమాలన్నీ సక్సెస్ కావడంతో అపజయం ఎరుగని తెలుగు డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. చివరిగా నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య వయసుకు తగ్గట్టుగా పాత్రను డిజైన్ చేసి హిట్ కొట్టాడు అనిల్. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకున్న ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే తాజాగా ఈ విషయంపై ఓ అప్డేట్ బయటకు వచ్చింది.

Anil Ravipudi on X: "Wishing a Very Happy Birthday to the most positive  person Victory Venkatesh garu. Will always cherish the fun times we had and  waiting for many more such moments

అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక కథ రెడీ చేసుకున్నాడని.. ఆ కథను ఆయనకు వినిపించగా లైన్ గా వినప్పుడు బానే ఉంది కానీ దాన్ని డెవలప్ చేసినప్పుడు ఏదో తేడా కొడుతుందని తనకు సూట్ కాదేమోనని భయంతో మెగాస్టార్ చిరంజీవి కథను రిజెక్ట్ చేశాడని తెలుస్తుంది. దీంతో ఇప్పుడు అదే స్క్రిప్ట్ తీసుకుని గతంలో వరుస సక్సెస్ లో అందించిన విక్టరీ వెంకటేష్ దగ్గరికి వెళ్ళాడట అనిల్. వెంకటేష్‌కు కథ వినిపించగా అది ఆయ‌న‌కు బాగా నచ్చిందని. మీరందరూ కాంబినేషన్లో ఎఫ్2, ఎఫ్3 సినిమాలో వచ్చి సూపర్ హిట్స్ కాగా.. మరోసారి వీరిద్దరి కాంబో సెట్స్‌ పైకి రానుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

Venkatesh: Had it not been for Chiranjeevi, I would have gone to the  Himalayas - Hindustan Times

దిల్ రాజు ప్రొడ్యూసర్గా ఈ సినిమాకు విహరించనున్నాడట. 2025 సంక్రాంతి ని టార్గెట్ చేస్తూ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే సంక్రాంతికి ఇప్పటికే శతమానం భవతి సీక్వెల్ అనౌన్స్ చేయడంతో.. రెండింటిని దిల్ రాజు ఒకేసారి బరిలో దింపుతాడా.. లేదా ఒక దాన్ని ఆపి తర్వాత రిలీజ్ చేస్తాడా అంశంపై క్లారిటీ రావాలి. ఇక చిరు వద్దంటూ రిజెక్ట్ చేసిన స్టోరీనే వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.