పూనమ్ పాండే చనిపోలేదు.. ఆమె బాడీగార్డ్ సెన్సేషనల్ కామెంట్స్..

నటిగా, మోడల్‌గా మంచి పాపులారిటి దక్కించుకున్న పూనమ్ పాండే ఇటీవ‌ల‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. గర్భాసయ‌ కాన్సర్ తో బాధపడుతూ ఆమె సడన్గా మృతి చెందింది. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ సోషల్ మీడియా ద్వారా వివరించాడు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రొమాంటిక్ బ్యూటీ పూనమ్‌ స్టార్ బ్యూటీగా పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఇంత చిన్న వయసులో ఆమె చనిపోవడం అభిమానులు అసలు నమ్మలేకపోతున్నారు. ఇక పూనామ్‌ మృతి వార్త విన్న ఆమె బాడీగార్డ్ ఆమె లేదన్న విషయాన్ని నమ్మలేమని.. పూనమ్‌ కుటుంబ సభ్యులు అధికారికంగా ఎందుకు ఆమె చనిపోయిందంటూ తెలియజేయడం లేదని ప్రశ్నించాడు.

Poonam Pandey Dies: Controversial model-actor dies due to cervical cancer, confirms manager - Entertainment News | The Financial Express

ఆమె దగ్గర నేను 11 ఏళ్లుగా బాడీగార్డ్ గా చేస్తున్న అంటూ అమీన్ ఖాన్ మాట్లాడాడు. పూనమ్ చనిపోలేదు అన్ని చనిపోయిందంటే నేను నమ్మను.. ఆమెతో నేను ఎన్నో ఏళ్ళు కలిసి పనిచేశా.. ఆమె ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. జనవరి 31న కూడా మేము కలిశాం. ఒక మాల్ లో ఫోటోషూట్ కోసం వెళ్ళినప్పుడు నేను అక్కడే ఉన్నా. ఆమె ఎప్పుడూ హెల్తీగా ఉంటుంది. ఫీట్ గా ఉంటుంది. నవ్వుతూ, నవ్విస్తూ ఉండే ఆమెకు అసలు అనారోగ్యం ఉందన్న విషయం నేనెప్పుడూ వినలేదు. ఇక ఉదయం సోషల్ మీడియాలో చూసి నేనూ తెలుసుకున్న.

 

వెంటనే పూనమ్ సోదరి ఇంటికి వెళ్లి నిజమేంటో తెలుసుకోవాలని ప్రయత్నించా. కానీ ఆమె నా ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. అసలు నిజమేంటో తెలియాలి అంటే తన సోదరీ రిప్లై ఇవ్వాలి. కొన్ని రోజుల క్రితం నేను పూనమ్‌ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ అంత నార్మల్గా అనిపించింది. ఆమె ఆల్కహాల్ తీసుకోవడం కూడా మానేసింది. అలాంటప్పుడు సడన్గా పూనమ్ చనిపోయింది అంటే ఎలా నమ్మేది.. ఈ విషయంపై పూనమ్ సోదరీ క్లారిటీ ఇవ్వాల్సిందే అంటూ వివరించాడు. ఇక ఆమె సోదరీ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.