శ్రీమంతుడు కాపీరైట్స్ కేసు పై స్పందించిన మైత్రి మేకర్స్.. ఏం అన్నారంటే..

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వ‌చ్చిన‌ శ్రీమంతుడు. ఈ మూవీ కాపీరైట్స్ వివాదం గ‌త‌కాలంగా సోషల్ మీడియాలో బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. చచ్చేంత ప్రేమ పేరిట తను రాసిన నవలను చిన్ని చిన్ని మార్పులతో శ్రీమంతుడు పేరిట రిలీజ్ చేశారంటూ.. డైరెక్టర్ కొరటాల శివ, ప్రొడ్యూసర్ ఎర్నేని రవి, ఎంబి ఎంటర్టైన్మెంట్ లపై రచయిత శరత్‌చంద్ర క్రిమినల్ కేసు పెట్టాడు. ఈ విషయంపై డైరెక్టర్ కొరటాల సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ విషయంలో మేము ఏమి చేయలేము అని కిందకొట్టు ఆదేశాలు పాటించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేప‌ద్యంలో కేసు వేసిన స‌ద‌రు రైటర్ ప‌లు ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

Mythri Movie Makers announce three crazy projects

ఇక‌ తాజాగా శ్రీమంతుడు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ వార్తలపై స్పందించింది. శ్రీమంతుడు స్టోరీ కాపీ వివాదంపై ఇప్పుడే స్పందించలేం.. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఇంకా నడుస్తూనే ఉంది. ఈరోజు వరకు ఎలాంటి విచారణ, తీర్పు స్పష్టంగా లేదు. అందుకే మేము ఇప్పుడే అభిప్రాయాన్ని చెప్పలేకపోతున్నాం. తప్పుడు వార్తలు రాస్తూ ప్రచారం చేయవద్దు మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ స్పందించింది. శ్రీమంతుడు కథపై సదరు రచయిత చేస్తున్నవన్నీ ఏ ఆధారాలు లేని ఆరోపణలు.. ఇక ఈ కేసు పై కోర్టు గాని, రచయితల సంఘం గారి ఎటువంటి తీర్పు ఇంకా స్పష్టం చేయలేదు. అలాగే శ్రీమంతుడు మూవీ, చచ్చేంత ప్రేమ నవల రెండు పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయి.

రెండు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. పుస్తకం, ఫిలిం పరిశీలించే వారు ఎవరైనా వీలైతే వాటిని చూసి వాస్తవాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాం అంటూ వివరించింది. ఇక శ్రీమంతుడు ముఖ్య ఉద్దేశం గ్రామాలని దత్తత తీసుకొని ఎంతో కొంత మేలు చేయాలని.. అదే ప్రధాన ఆలోచన అంటూ వివరించింది. కోర్టు నుంచి తీర్పు రాకుండా మేము ఎలాంటి కామెంట్లు చేయమని అది చట్ట‌ విరుద్ధం. మాకు చట్టాం, న్యాయంపై నమ్మకం ఉంది అంటూ మైత్రి సంస్థ వివరించింది. ఇక కోర్టు పరిధిలో ఈ అంశంపై పాల్స్ ఎలిగేష‌న్‌ చేస్తున‌ ప్రతి ఒక్కరిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ వివరించింది. దయచేసి ఆధారం లేని ఆరోపణలు.. సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దంటూ మైత్రి మేకర్స్ విజ్ఞప్తి చేసింది.