త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న విజయ్ వర్మ – తమన్నా.. విజయ్ క్లారిటీ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాక్ట‌ర్లుగా మంచి క్రేజ్ తెచ్చుకున్న‌వారిలో తమన్నా , విజయ్ వర్మ జంట కూడా ఒక‌రు. వీరిద్దరూ ఇప్ప‌టికి ఇండస్ట్రీలో నటీనటులుగా దూసుకుపోతున్నారు. ఇక వీరిద్ద‌రు లస్ట్ స్టోరీస్ 2 లో క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసింది. ఆ టైంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇక వీరి డేటింగ్ విష‌యం బ‌య‌ట‌కి వ‌చ్చిన త‌ర్వాత‌ ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపిస్తున్నారు.

Tamannaah Bhatia and Vijay Varma: From PDA in Goa to breaking kiss policy;  Couple's dating timeline in PICS | PINKVILLA

ఈ విధంగా తమన్నా – విజయ్ చట్టా పట్టాలేసుకొని తిరగడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు తెగ‌ వైరల్ అవుతున్నాయి.ఇక‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు విజయ్ వర్మకు.. తమన్నాతో పెళ్లి గురించి ఆశ‌క్తి క‌ర‌మైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నల‌పై విజయ్ స్పందిస్తు ఇప్పటికే నా మేనకోడలు మా అమ్మను ఇలాంటి ప్రశ్నలు అడుగుతోంది.. నేను హైదరాబాద్‌లో కూడా చాలా సార్లు ఈ ప్రశ్న ఫేస్‌చేశా అంటూ త‌న‌స్టైల్‌లో ఛమత్కరించాడు.

Vijay Varma says he's 'happy' after Tamannaah Bhatia confirmed their  relationship | Filmfare.com

దీంతో ఆ ప్రశ్నకు స‌మాధానం చెప్ప‌కుండా తెలివిగా దాటేశాడ‌ని స‌మాచారం. ఇక ఈ ఏడాదిలోనే తమన్నా, విజయ్ వర్మ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్‌. వచ్చే రెండు, మూడు నెలలలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నార‌ట‌. తమన్న సాంప్రదాయం ప్రకారం పెళ్ళికి ముందు కుటుంబ సభ్యులందరూ కూడా పలు దేవాలయాలను సందర్శించాల్సి ఉంటుందట‌. ప్రస్తుతం త‌మ‌న్న ఆ పనిలోనే ఉంద‌ని తెలుస్తుంది. త్వరలోనే వీరి మ్యారేజ్‌డేట్‌ గురించి కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.