అరెరె..అంత మంచి సీన్ ఎలా మిస్ చేశావ్ ప్రశాంత్ బ్రో.. హనుమాన్ లెటేస్ట్ న్యూస్ వైరల్..!!

హనుమాన్ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ తేజ నటన ఈ సినిమాని మరో మెట్టెక్కించాయి . ఇంకా సక్సెస్ఫుల్గా థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది ఈ మూవీ అంటే సినిమాలో ఎంత స్టామినా ఉందో అర్థం చేసుకోవచ్చు . రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ .

ఈ సినిమాలో ఎక్కడో హిమాలయాల్లో ధ్యానంలో ఉన్న ఆంజనేయుడు విభూషణుడు మాటతో మేల్కొని బయటకు వస్తాడు. అక్కడి నుంచి వాయువేగంతో హీరో దగ్గరికి వస్తాడు. హీరో దగ్గరికి వచ్చే సమయంలో కొన్ని సీన్స్ మనకి విజువలైజేషన్ పరంగా బాగా ఆకట్టుకుంటాయి . వారణాసిలో ఒక ముని ధ్యానం చేస్తూ ఉండగా హనుమాన్ ఆకాశంలో వాయువేగంతో వెళ్లడంతో ఆ ముని కళ్ళు తెరిచి పైకి చూస్తాడు .. నిజానికి ఈ సీన్ ని ప్రశాంత్ వర్మ వేరేగా చిత్రీకరించాలనుకున్నాడట .

అయోధ్య రామ మందిరం ఎదురుగా ఉన్న దీపాలను ఒక పాప వెలిగించడానికి ట్రై చేస్తూ ఉంటుందట . ఆ సమయంలో గాలి ఎక్కువగా రావడం వల్ల దీపాలు వెలిగించలేకపోతుందట . అయితే హనుమాన్ ఆ సమయంలో పైన వెళ్లడంతో ఒక్కసారిగా దీపాలు వాటికి అవే వెలిగిపోతాయట . అలా సీన్ ని రాసుకున్నాడట ప్రశాంత్ వర్మ . కానీ కొన్ని కారణాల చేత అలా తెరకెక్కించలేకపోయాడట . ఈ విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు ప్రశాంత్ వర్మ . ఈ మాటలు విన్న ఆడియన్స్ ఇంత మంచి సీన్ ఎలా మిస్ చేసావు అంటూ మాట్లాడుకుంటున్నారు..!!